Advertisement
Google Ads BL

ఆహా అతి.. మెగా ఫ్యాన్స్ కి తప్పింది మతి


అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఆహా ఓటిటి ఇప్పుడు ఆహా అనిపించుకోవడం అటుంచి.. మెగా ఫాన్స్ నుండి ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తుంది. అల్లు ఫ్యామిలీ, కొణిదెల ఫ్యామిలీ వేర్వేరు కాదు.. కానీ ఆహా టీం దాన్ని సపరేట్ చేసేసింది. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ (పవన్ ఫాన్స్ దగ్గర) అన్నందుకు పవన్ ఫాన్స్ అల్లు అర్జున్ వెంటాడి వేటాడారు. దెబ్బకి దిగొచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి మెగా ఫాన్స్ చేతిలో బుక్ అయ్యాడు. కారణం ఆహా టీం ఓవేరేక్షన్. సమంత తో ఆహా కోసం సామ్ జాం టాక్ షో చేపిస్తున్న ఆహా టీం.. బన్నీ షో ప్రోమోస్ లో అతి చేస్తూ.. అల్లు అర్జున్ మెగాస్టార్ గా వర్ణిస్తూ  ప్రోమోస్ కట్ చేసి వదిలింది.

Advertisement
CJ Advs

దానితో చిరు అదే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. మెగాస్టార్ అంటే కేవలం చిరంజీవి మాత్రమే. నిన్నగాక మొన్నొచ్చిన అల్లు అర్జున్ మెగాస్టార్ అయిపోతాడా? అంటూ ఏసుకుంటున్నారు. మెగాస్టార్ అంటే చిరునే.. చిరు మాత్రమే మెగాస్టార్. ఆ స్థానం మరెవ్వరికీ లేదు, రాదు అంటూ మెగా ఫాన్స్ బన్నీని ఆడేసుకుంటున్నాడు. మెగా ఫాన్స్ కి ఆహా టీం అడ్డంగా దొరకడంతో.. ఆహా టీం దొగొచ్చింది. మెగా ఫాన్స్ కి సారి చెప్పడమే కాదు.. ఆహా టాక్ షో ప్రోమోస్ లో పొరబాటు జరిగింది అని, మెగాస్టార్ అంటే చిరంజీవే మరెవ్వరూ కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఆహా టీం కావాలనే బన్నీని హైప్ చెయ్యడానికి మెగాస్టార్ గా వర్ణించిందా? లేదంటే అల్లు ఫ్యామిలీ వేరు కుంపటికి రెడీ అయ్యే ఇలాంటి లీకులు వదులుతుందా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Aha team's over action, Allu Arjun gets sacrificed!!:

Aha Apologizes To Megastar Chiranjeevi Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs