Advertisement
Google Ads BL

బిగ్ బాస్ మరో బిగ్ రికార్డ్!


బిగ్ బాస్ సీజన్ 4 ఎంత చెత్తగా ఉన్నప్పటికీ.. గ్రాండ్ ఫినాలేని స్టార్ మా యాజమాన్యం ఓ రేంజ్ లో ఏర్పాటు చేసింది. నాగార్జున హోస్ట్ గా లక్ష్మి రాయ్, మెహ్రీన్ కౌర్, ప్రణీత సుభాష్ డాన్స్ హాట్ పెరఫార్మెన్స్ మాత్రమే కాకుండా కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీతో బిగ్ బాస్ స్టేజ్ మీద ఉత్సాహం ఉరకలు వేసింది. ఇక విన్నర్ ని ప్రకటించడానికి మెగాస్టార్ చిరు బిగ్ బాస్ స్టేజ్ మీద చేసిన సందడి అంతా ఇంతా కాదు. మెగా స్టార్ చిరు కామెడీ, ఆయన రొమాంటిక్ చూపులు అలాగే చిరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తీరు, సోహైల్ కి చిరు భార్య సురేఖ బిర్యానీ పంపించడం ,మెహబూబ్ కి పది లక్షల చెక్ ఇవ్వడం, దివి కి తన సినిమాలో ఆఫర్ ఇవ్వడం వంటి విషయాలతో బిగ్ బాస్ స్టేజ్ మీద చిరు చేసిన అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement
CJ Advs

దాదాపుగా నాలుగున్నర గంటల సేపు సాగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదట్లో కాస్త బోర్ అనిపించినా హీరోయిన్స్ హాట్ పెరఫార్మెన్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెరఫార్మెన్స్, అలాగే విన్నర్ గా అభిజిత్ టైటిల్ ట్రోఫీని గెలవడం, సోహెల్ 25 లక్షలతో బయటికి రావడం ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులకు ఇంట్రస్ట్ గా అనిపించాయి. అందుకే ఆ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రికార్డు స్థాయిలో టీఆర్పీని మూటగట్టుకుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఏకంగా 19.5 హైయ్యెస్ట్ టిఆర్పి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగ్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి 18.29 రేటింగ్ వస్తే ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ దానిని బ్రేక్ చేసింది. 

Chiru and Nag break Records:

Record TRP for Bigg Boss Grand Finale!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs