Advertisement
Google Ads BL

నా కోసం ఎలాంటి మార్పులు చెయ్యొద్దు!


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మధ్యనే క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాడు. సంజయ్ దత్ కి క్యాన్సర్ అని తెలియడంతో ఆయన నటించే సినిమా మేకర్స్ ఒకింత టెంక్షన్ కి గురయ్యారు. అయితే సంజయ్ దత్ చాలా త్వరగా క్యాన్సర్ బారి నుండి తప్పించుకుని తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చెయ్యడానికి వచ్చేసాడు. బాలీవుడ్ సినిమాలే కాకుండా కన్నడ సూపర్ హిట్ ఫిలిం కెజిఎఫ్ కి  సీక్వల్ గా రాబోతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 లో సంజయ్ దత్ పవర్ ఫుల్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. అధీరా ఫస్ట్ లుక్ తోనే పాత్రపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్ సంజయ్ దత్ కి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ సంజయ్ దత్ క్యాన్సిర్ తో పోరాడి కాస్త సిక్ అవడంతో.. కెజిఎఫ్ లో అధీరా కి సంబందించిన కొన్ని సన్నివేశాలను మార్చాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

Advertisement
CJ Advs

అందులో సంజయ్ దత్ ఆరోగ్య విషయాలను దృష్టిలో ఉంచుకుని పోరాట సన్నివేశాల వలన మళ్ళీ వీక్ అయ్యే ఛాన్స్ ఉన్న కారణంగా యాక్షన్ సీక్వెన్స్ లో భారీ మార్పులకి రెడీ అయ్యారట కెజిఎఫ్ మేకర్స్. ఆ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ యాక్షన్ సన్నివేశాలు చెయ్యలేననుకుని నన్ను అవమానించకండి. ముందు అనుకున్న విధముగానే కెజిఎఫ్ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేద్దాం.. కానీ నాకోసం ఎలాంటి మార్పులు చెయ్యకండి.. పని విషయంలో రాజి పడే ప్రసక్తే లేదంటూ.. సంజయ్ దత్ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి చెప్పడంతో.. పని పట్ల ఆయనకున్న డెడికేషన్ కి ఆశ్చర్యపోయాడట. ఇక సంజయ్ చెప్పినట్టుగానే కెజిఎఫ్ లో సంజయ్ దత్ ఉన్నటువంటి యాక్షన్ సన్నివేశలను యధాతధంగా చిత్రీకరించాడనికి రెడీ అయ్యారట మేకర్స్. మరి యశ్ పుట్టిన రోజు కానుకగా జనవరి 8 న కెజిఎఫ్ టీజర్ కి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

Don't make any changes for me!:

Sanjay dutt says Don't insult me ​​for not being able to do action scenes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs