Advertisement
Google Ads BL

ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్.. ఇంతకీ ఎవరతను!


మా మధ్యన ఏం లేదంటూనే పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్స్ తో జంటగా విహారయాత్రలకు, డేటింగ్ అంటూ లంచ్ పార్టీకి వెళుతుంటారు హీరోయిన్స్. బాలీవుడ్ లో జంట పక్షుల్లా జంటగా తిరిగిన రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా - నిక్ లు, అనుష్క శర్మ - విరాట్ కోహ్లీలు పెళ్లి పీటలెక్కారు. తాజాగా కొన్నాళ్లుగా ప్రేమికులుగా జంటగా తిరుగుతున్న రణబీర్  కపూర్ - అలియా భట్ లు త్వరలోనే పెళ్లి చెసుకోబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. ఇప్పుడు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఎయిర్ పోర్ట్ లో దొరికింది. గతంలోనే సౌత్ ఆఫ్రికా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడే ఎయిర్ పోర్ట్ లో కెమెరా కళ్ళకు చిక్కిన కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్ర లు కేవలం ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రలు 2021 కి వెల్ కామ్ చెప్పడానికి మాల్దీవులకు వెకేషన్స్ కి చెక్కేశారు. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో సిద్ధార్ధ్ మల్హోత్రతో పాటుగా కియారా అద్వానీ కెమెరా కంటికి చిక్కారు. దానితో అందరూ ఇప్పుడు చెప్పు కియారా సిద్దూ.. ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో మంచి ఊపు మీదున్న కియారా అద్వానీ ఎప్పుడో ప్రేమలో పడినట్లుగా ప్రచారం జరిగినా ఈ జంట మాత్రం స్పందించకుండా గుంభనంగానే ఉంది. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కియారా - సిద్ధార్ధ్ మల్హోత్రలు మాల్దీవుల ట్రిప్ వేశారు. అక్కడ మాల్దీవుల్లో ఓ వారం పాటు ఈ ప్రేమ జంట స్టే చేస్తున్నట్లుగా సమాచారం.

Friend or Boy Friend:

Kiara Jets Off With Beau For New Year
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs