2020 సంవత్సరం మొత్తం కరోనా తో ముగిసిపోయింది. బడా సినిమాల షూటింగ్స్ లేవు, బడా సినిమాల విడుదలలు లేవు. కరోనా కరోనా అంటూ 2020 కి ముగింపు పలుకుతున్నారు. అయితే ఈ ఏడాది పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అవడం పక్కా. అందుకే ఇప్పటినుండే దర్శకనిర్మాతలు సినిమా షూటింగ్స్ ని పరిగెత్తిస్తున్నారు. జనవరిలో 8 న విడుదల కావల్సిన రాజమౌళి పాన్ ఇండియా మూవీ RRR కరోనా దెబ్బకి విలవిలలాడింది. జనవరి 8 కి కనీసం టీజర్ కూడా విడుదల చెయ్యలేని పరిస్థితి. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో RRR చిత్రీకరణను పరిగెత్తిస్తుంటే.. కరోనా తో రామ్ చరణ్ హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోవడంతో షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దానితో రాజమౌళి మరోసారి తలపట్టుకున్నాడు.
ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన కరొనకి దొరికిపోయిన రామ్ చరణ్ వలన మరో 14 రోజులు షూటింగ్ కి అంతరాయం కలిగింది. అయినప్పటికీ రాజమౌళి RRR షూటింగ్ ని ఏప్రిల్ కల్లా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా.. గ్రాఫిక్స్ వర్క్ ని ఆగష్టు కల్లా ఫినిష్ చేసి 2021 కి దసరా నాటికి RRR ని విడుదల చే ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. రామ్ చరణ్ కి కరోనా తగ్గి RRR సెట్స్ లో జాయిన్ అయ్యాక అయినా.. లేదంటే ఈ సంక్రాంతికి అయినా రాజమౌళి RRR విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RRR విడుదల విషయంలో రాజమౌళి పక్కా ప్లాన్ అమలు చేసి భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడట.