అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. నాగ చైతన్య కన్నా షార్ప్ గా ఉండే అఖిల్ తొందరగా నిలదొక్కుకుంటాడనుకుంటే.. అఖిల్ కి హిట్ అనేది అందని ద్రాక్షలాగే తయారైంది. అందుకే హీరోయిన్స్ క్రేజ్ మీద గ్లామర్ మీద కి ఫోకస్ చేసిన అఖిల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసాడు. ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో అఖిల్ పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే పూజ హెగ్డే గ్లామర్ స్టిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక తర్వాత సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ లోను అఖిల్ హీరోయిన్ క్రేజ్ నే వాడుకుందామనుకుని మరో టాప్ హీరోయిన్ రష్మిక ని అఖిల్ సరసన హీరోయిన్ గా తీసుకుంటున్నారనే టాక్ నడిచింది.
దాదాపుగా అఖిల్ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన్న ఫిక్స్ అనే అన్నారు. కానీ ఇప్పుడు రష్మిక అఖిల్ కి దొరికేలా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ తో పాటుగా బాలీవుడ్ లో సిద్దార్ద్ మల్హోత్రా మిషన్ మజ్ను సినిమాలో.. తాజాగా అమితాబచ్చన్ సినిమాలో రష్మిక అమితాబ్ కి కూతురుగా నటించడానికి ఒప్పుకుందనే టాక్ నడుస్తుంది. అంటే బాలీవుడ్ మూవీస్, పాన్ ఇండియా మూవీ తో పాటుగా రష్మిక శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో హీరోయిన్ గా ఫుల్ బిజీ. దానితో అఖిల్ కి రష్మిక డేట్స్ అందేలా కనిపించడం లేదు.
రష్మిక కాకపోతే మరో క్రేజీ హీరోయిన్ అనుకోవడానికి.. ప్రస్తుతం పూజ హెగ్డే లేదా రష్మిక అదీ కాదంటే బాలీవుడ్ భామో అంతే ఆప్షన్స్. అందుకే అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబో కి ఓ ముంబై మోడల్ ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై టాప్ మోడల్ సాక్షి వైద్య ని అక్కినేని యంగ్ హీరో అఖిల్ కోసం తీసుకురాబోతున్నట్టుగా సమాచారం.