Advertisement
Google Ads BL

పవన్ మ్యానరిజాన్నిహేళన చేసిన మంత్రి!


పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.. తాను సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్, కొడాలి నాని కంచుకోట గుడివాడ లో పర్యటించాడు. గుడివాడలో పర్యటించిన పవన్ కొడాలి కోడలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసిపిలో చాలామంది నానీలు ఉన్నాయి. ఏ నాని అయితే మనకేంటి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని ఎప్పటిలాగే రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ లాంటి చాలామంది బోడి లింగాలు ఉన్నారని.. తాము మాత్రం శివ లింగాల లాంటివాళ్లమంటూ బూతులతో రెచ్చిపోయాడు.

Advertisement
CJ Advs

ఇక మరో మంత్రి పేర్ని నాని అయితే పవన్ కళ్యాణ్ కి నాని అంటే ఎవరో తెలియదా.. అసలు ఇంతకీ పవన్ అంటే ఎవరు? మెడపై చెయ్యి పెట్టుకుని మట్టి నలుపుకుంటూ ఉండే వాడేనా పవన్ కళ్యాణ్ అంటూ.. పవన్ కళ్యాణ్ సినిమాలలో వాడే మ్యానిరాజాన్ని ఎద్దేవా చేసాడు. టిడిపికి, బిజెపికి చిడతలు కొడుతూ డబ్బు సంపాదిస్తాడు పవన్ కళ్యాణ్, అంటూ పవన్ ని ప్రజలు నమ్మొద్దు అంటూ మాట్లాడాడు. మరి సినిమాల్లో పవన్ కళ్యాణ్ మ్యానిరిజాన్ని చాలామంది ఫాలో అయితే.. ఏపీ మంత్రి పేర్ని నాని హేళన చేయడంపై పవన్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ అంటే ఊరుకోమంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ vs నానీల మధ్యన వైరం హాట్ టాపిక్ గా మారింది.

Minister who mocked Pawan mannerism:

Minister Perni Nani counter to Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs