Advertisement
Google Ads BL

పెళ్లి కన్నా పార్టీల హడావిడే ఎక్కువైంది!


ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో థియేటర్స్ ఓపెన్ అయ్యి కొత్త సినిమా రిలీజ్ హడావిడి కన్నా ఎక్కువగా సునీత మళ్ళీ పెళ్లి విషయం తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం సునీత రెండో పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమవడమే కాదు.. కాబోయే భర్త మ్యాంగో రామ్ తో కలిసి పార్టీలతో హడావిడి చేస్తుంది. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అంటూ సునీత ఇప్పుడు రామ్ తో కలిసి మాములుగా ఎంజాయ్ చెయ్యడం లేదు. గత వారం నితిన్ హోస్ట్ గా మ్యాంగో రామ్ సునీత సన్నిహితులకు, స్నేహితులకి, ఇండస్ట్రీలోని సునీత ఫ్రెండ్స్ కి హైదరాబాద్ లోని ఓ కాస్ట్లీ హోటల్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో సుమ, రేణు దేశాయ్, ఇంకా కొంతమంది సింగర్స్ కూడా హాజరయ్యారు. ఆ పార్టీ ఏ రేంజ్ లో జరిగిందో.. బయటకొచ్చిన  ఫొటోస్ తోనే తెలిసింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఇప్పుడు సునీత స్పెషల్ గా ఇండస్ట్రీలోని ప్రముఖులకు తన రెండో పెళ్లి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వబోతుంది. ఈ శనివారం రాత్రి సునీత తన పెళ్లి పార్టీ ఓ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించబోతుంది. ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరవబోతున్నారని.. ప్రస్తుతం సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటున్నారు. పెళ్లి పనులకన్నా పార్టీల హడావిడే ఎక్కువైంది సునీతకి అంటున్నారు నెటిజెన్స్. మరి జనవరి 9 న పెళ్లి చేసుకోబోతున్న సునీత ప్రస్తుతం ఈ 2020 ఎండింగ్ లో పార్టీలతో ఎంజాయ్ చేస్తుంది. 2020 అందరికి బ్యాడ్ ఇయర్ అయినా.. సింగర్ సునీతకి మాత్రం మంచే చేసింది.

The rush of parties was greater than the wedding!:

Sunitha pre party to be hosted in hotel to night
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs