Advertisement
Google Ads BL

బాలీవుడ్ హీరో షాహిద్ సరసన సౌత్ బ్యూటీ!


సౌత్ బ్యూటీస్ కి అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కుతుంటారు. అక్కడ వర్కౌట్ ఆవ్వకపోతే సౌత్ లోనే ఉండిపోతున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కాజల్, తమన్నా లాంటి వాళ్ళు బాలీవుడ్ లో అదృష్టం పరిక్షించుకున్నవాళ్ళే. తాజాగా మరో సౌత్ బ్యూటీ బాలీవుడ్ స్ట్రయిట్ మూవీలో నటించడం కన్ఫర్మ్ అయ్యింది. ఆవిడే కన్నడ బ్యూటీ రష్మిక. ఇప్పుడు మరో బ్యూటీ బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతుంది. ఎప్పుడూ గ్లామర్ గ మెరిసిపోయే రాశి ఖన్నా ఈమధ్యన ట్రెడిషనల్ గా విలేజ్ అమ్మాయిలా తయారై ఫోటో షూట్స్ చేయించుకుంటుంది. డీ గ్లామర్ పాత్రలకు సై అంటూ హింట్ ఇస్తుంది. తెలుగులో ఆవకాశాలు లేని రాశి ఖన్నాకి తమిళనాట, అలాగే దుల్కర్ - హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం వచ్చినట్టుగా టాక్ ఉంది.

Advertisement
CJ Advs

అయితే తమిళంలో అరాన్మానై 3, మేథావి, తుగ్లగ్ దర్బార్, సైతాన్ కా బచ్చా సినిమాలతో బిజీగా ఉన్న రాశి ఖన్నా ఇప్పుడు బాలీవుడ్ హీరో షాయిద్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లుగా సోషల్ మీడియా న్యూస్. తెలుగు దర్శకులు రాజ్- డీకే ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో షాహిద్ కపూర్ తో కలసి రాశీఖన్నా నటించనుందని తాజాగా సమాచారం. మరి షాహిద్ కపూర్ సరసన రాశి ఖన్నా వెబ్ సీరీస్ అంటే అమ్మడు రేంజ్ పెరిగినట్టే. రాజ్- డీకే ద్వయం ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అదరగొట్టగా.. దానికి సీక్వెల్ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ త్వరలోనే రెడీ కాబోతుంది. 

South beauty opposite Bollywood hero?:

Rashi khanna to act with Shahid kapoor for web series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs