Advertisement
Google Ads BL

చరణ్ సరసన పూజానా? రష్మికానా?


చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ నిర్విఘ్నంగా సాగుతుంది. కరోనా కల్లోలం నుండి బయట పడి చిరంజీవి ఆచార్య షూటింగ్ కి హాజరవుతున్నారు. ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ పవర్ రోల్ ప్లే చేస్తున్న విషయం కొరటాల రివీల్ చేసేసాడు. అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చిరు తో పాటుగా ట్రావెల్ చేస్తాడన్నమాట. అంత కీలక పాత్రకి హీరోయిన్, డ్యూయెట్స్ లాంటివికూడా ఉంటాయని చెప్పాడు కొరటాల. అయితే ఆ హీరోయిన్ పేరుని మాత్రం రివీల్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

అయితే దాదాపుగా లక్కీ గర్ల్ రశ్మికనే రామ్ చరణ్ కి జోడి అన్నారు. కానీ తాజాగా రష్మిక డేట్స్ ఖాళీ లేకపోవడం మరో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ని ఆచార్య టీం సంప్రదించినట్టుగా లెటేస్ట్ న్యూస్. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోను, ప్రభాస్ రాధేశ్యాం మూవీస్ చేస్తున్న పూజ బాలీవుడ్ లోను బిజీ. అయినప్పటికీ రామ్ చరణ్ కి జోడి అనగానే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటా కంగారు పడకండి అంటూ పూజ కొరటాలకి మాటిచ్చేనట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. మరి రష్మిక కూడా తెలుగులో పుష్ప పాన్ ఇండియా సినిమాతో పాటుగా శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లతో పాటుగా బాలీవుడ్ లో కి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అసలు ఇప్పుడు ఆచర్యలో రామ్ చరణ్ సరసన నటించబోయేది రష్మికానా? లేదంటే పూజానా? అనేది కొరటాల క్లారిటీ ఇవ్వాల్సిందే.

Charan opposite Pooja or Rashmika?:

Rashmika and Pooja in talks for role in Acharya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs