కొన్నాళ్లుగా మంచు హీరోల జోరు ఇండస్ట్రీలో తగ్గింది అనే చెప్పాలి. మోహన్ బాబు సీనియర్ లిస్ట్ లోకి చేరిపోయి..సినిమాలు ఒబ్బిడిగా చేస్తుంటే, మంచు విష్ణు అప్పుడప్పుడు సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. ఇక మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మరోపక్క వ్యక్తిగత సమస్యలతో మనోజ్ కొన్ని రోజులు బయట కనబడలేదు. ప్రస్తుతం, మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా తోనూ, మంచు విష్ణు మోసగాళ్లు, ఢీ సీక్వెల్ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇక మనోజ్ కొత్త సినిమా విశేషాలేమి సోషల్ మీడియాకి అందడం లేదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న మంచు మనోజ్ తాజా లుక్ వైరల్ అవుతుంది. బొద్దుగా ఉండే మనోజ్ స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు.
రెండు రోజుల క్రితం ఫ్రెండ్ మొదలుపెట్టిన బిర్యానీ హౌస్ రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం బయటికి వచ్చిన మనోజ్.. నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త లుక్ చూస్తే రాకింగ్ మనోజ్ అనేస్తారు. అంత స్లిమ్ లుక్ లో, సూపర్ స్టైలిష్ గా మనోజ్ ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. చైర్ లో స్పెట్స్ పెట్టుకుని స్టైలిష్ గా కూర్చున్న మనోజ్ సూపర్ స్లిమ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి బరువు తగ్గి.. స్లిమ్ గా తయారైన మనోజ్ కొత్త సినిమా ప్రకటన కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. మరి కొన్నాళ్లుగా కనబడకుండా.. ఇలా స్లిమ్ గా దర్శనమిచ్చిన మనోజ్ ఎమన్నా కొత్త సినిమా మొదలెడుతున్నాడేమో అందుకే.. ఇలా స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నాడు అంటున్నారు నెటిజెన్స్.