Advertisement
Google Ads BL

చెర్రీ క్రిస్మస్ పార్టీలో మెగా ఫ్రేమ్ అదిరింది!


నిన్నగాక మొన్న మెగా డాటర్ నిహారిక పెళ్ళిలో హడావిడి చేసిన మెగా ఫ్యామిలీ మొత్తం.. ఫొటోస్ తోనూ, వీడియోస్ తో అదరగొట్టేసారు. పవన్ కళ్యాణ్ రాక, మెగాస్టార్ చిరు ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, నాగబాబు ఫామిలీస్ అన్ని నిహారిక పెళ్లిలో చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. మెగా ఫ్యామిలీ అంటేనే అల్లు అర్జున్ దగ్గరనుండి రామ్ చరణ్, చిరు, పవన్, సాయి ధరమ్ వరకు అందరూ కలిసి ఉండే ఫ్యామిలీ. తాజాగా క్రిస్మస్ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ ఒకే చోట కలిసి సీక్రెట్ శాంత ఆడింది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీకి అల్లు అర్జున్, అలాగే కొత్తల్లుడు చైతన్య, శ్రీజ, అల్లు శిరీష్, సాయి ధరమ్, వరుణ్ తేజ్ ఇలా మెగా ఫామిలీస్ అంతా హాజరై క్రిస్మస్ వేడుకలని ఘనంగా జరుపుకున్నారు. మా అందరి నుండి మీకు క్రిస్మస్ శుభాకంక్షాలు.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మెగా కజిన్స్ అందరూ సీక్రెట్ శాంతా ఆడారు.. ఈ పార్టీ కి హోస్ట్ చేసిన రామ్ చరణ్ - ఉపాసనాలకు థాంక్స్ చెబుతూ అల్లు హీరో శిరీష్ మెగా ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. నిజంగా రామ్ చరణ్ హోస్ట్ చేసిన పార్టీలో మెగా ఫ్రేమ్ అదిరింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, శ్రీరిష్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ, నిహారిక, చైతన్య, సుస్మిత, స్నేహ, వైష్ణవ తేజ్, బాబీ, కళ్యాణ్ దేవ్ లతో మెగా ఫ్రేమ్ కళకళలాడింది.

Mega cousins Play secret Santa:

Ram charan - Upasana host Christmas party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs