Advertisement
Google Ads BL

సమంతని రంగస్థలం రామలక్ష్మి పాత్రకి వద్దన్నారట!


సమంత గ్లామర్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మిడ్డీ వేసినా, బికినీ వేసినా సమంత గ్లామర్ షోకి సలాం కొట్టాల్సిందే. అక్కినేని అభిమానులు గోల పెడుతున్నారని.. సమంత పెళ్లి తర్వాత గ్లామర్ షో చెయ్యడం మానలేదు. పెళ్లయినా సమంత పద్దతి మార్చలేదు. ఇప్పటికీ గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గదు. అయితే అంత గ్లామర్ గర్ల్ రంగస్థలంలో డీ గ్లామర్ గా రామలక్ష్మి పాత్ర చేసినా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కానీ సినిమా లో సమంతని రామలక్ష్మి పాత్రకి అనుకున్నప్పుడు ఇంత గ్లామర్ గర్ల్ ని అలా రామలక్ష్మిగా ప్రేక్షకులు ఒప్పుకోరేమో అని అసిస్టెంట్ డైరెక్టర్స్ సందేహాలు వెళ్లబుచ్చారట. అందుకే ఆ పాత్రకి సమంతని వద్దని కూడా చెప్పారట. 

Advertisement
CJ Advs

అసలు సుకుమార్ రంగస్థలంలో రామలక్షి పాత్రకి సమంతని సంప్రదించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యిందట. రామలక్ష్మి పాత్రని ఛాలెంజింగ్ తీసుకున్నానని.. సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో క్రిష్ - రకుల్ పాల్గొన్న సామ్ జామ్ షోలో సమంత బయటపెట్టింది.

ఎందుకంటే రకుల్ కూడా క్రిష్  కొండనవల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేసింది. అయితే గ్లామర్ గా ఉండే రకుల్ తో ఇలాంటి పల్లెటూరి అమ్మాయి పాత్ర కోసం అడగగానే రకుల్ చెయ్యడానికి రెడీ అయ్యింది. తన గ్లామర్ ఇమేజ్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పింది. కానీ రకుల్ ప్రీత్ ని ఎప్పుడూ గ్లామర్ గా చూసే ప్రేక్షకులు ఇలా డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తే ఒప్పుకుంటారా అనే సందేహం ఇంకా వెంటాడుతూనే ఉంది అని క్రిష్ అనగానే సమంత రంగస్థలంలో తాను డీ గ్లామర్ రోల్ చేసే ముందు ఘటనలను ఈ షో లో బయటపెట్టింది.

She was not needed for the role of Ramalakshmi!:

Samantha was not needed for the role of Ramalakshmi in Rangastalam 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs