Advertisement
Google Ads BL

జబర్దస్త్ ని వదిలేలా చేశారే..!

ఈటీవీలో గురు, శుక్రవారాలు కామెడీ ప్రియులని కట్టిపడేస్తున్న జబర్దస్త్ షో.. కేవలం కామెడీతోనే కాదు.. కాంట్రవర్సీలతోను హైలెట్ అయ్యింది. నాగబాబు జబర్దస్త్  షో నుండి బయటికి వచ్చి జబర్దస్త్ షో మీద నానా రకాల కాంట్రవర్సీలకు తెర లేపాడు. అలాగే వెళ్తూ తనతో పాటుగా స్ట్రాంగ్ కమెడియన్స్ చమ్మక్ చంద్ర. ఆర్పీ లను వెంట తీసుకుపోయాడు. తాజాగా మరో కమెడియన్ జబర్దస్త్ ని వదిలి వచ్చేలా చేసింది నాగబాబు బ్యాచ్. అంటే జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ముక్కు అవినాష్ లాక్ డౌన్ కారణంగా అప్పులు పాలవడంతో జబర్దస్త్ షో చేస్తున్నప్పడు ఈ బిగ్ బాస్ ఆఫర్ రావడంతో.. డబ్బు కోసమే బిగ్ బాస్ కి వెళదామని మల్లెమాల వాళ్ళని అడిగితే కాంట్రాక్టు ప్రకారం పది లక్షలు కట్టించుకున్నారని అవినాష్ తాజాగా జబర్దస్త్ విషయంలో తనపై వస్తున్న న్యూస్ పై ఓపెన్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అవినాష్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడే పది లక్షలు ఫైన్ కట్టాడంటూ నాగబాబు బ్యాచ్ మాట్లాడింది. తాజాగా అవినాష్ అదే న్యూస్ ని కన్ఫర్మ్ చేసాడు. నేను అక్కడ ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నా కూడా వాళ్ళు పది లక్షలు కట్టించుకున్నారు.. ఏ రెండు మూడు లక్షలో కడదామంటే కుదరదు పది కట్టాల్సిందే అంటే.. దానికి చమ్మక్ చంద్ర వంటి ఫ్రెడ్స్ సహాయం చేసారని.. ఆ పది లక్షలు కట్టే బిగ్ బాస్ లో అడుగుపెట్టా అంటున్నాడు అవినాష్. ఆ రకంగా అవినాష్ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేలా చేసింది చంద్రా వల్లే కదా. అయితే అది మల్లెమాల తప్పుకాదని.. ఇలా మరో కమెడియన్ చేయకూడదనే నా  దగ్గర పది లక్షలు కట్టించుకున్నారంటూ మాట్లాడాడు. మరి అవినాష్ కి అలా హెల్ప్ చేసి జబర్దస్త్ నుండి  అవినాష్ బయటికెళ్లేలా చేసింది నాగబాబు బ్యాచ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అవినాష్ అలా రిస్క్ చేసి జబర్దస్త్ ని వదిలినా.. అతనికి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ వచ్చి వెండితెర అవకాశాలు వస్తున్నట్టుగా అవినాష్ చెప్పడం చూస్తే అవినాష్ జబర్దస్త్ ని వదిలినా ప్రాబ్లెమ్ లేదనిపిస్తుంది. అంతేకాకుండా స్టార్ మా లో అవినాష్ ఓ కామెడీ షో కి యాంకర్ గా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా టాక్ నడుస్తుంది.

You made leave Jabardasth !!:

Mukku Avinash has revealed that he borrowed and paid Rs 10 lakh for the organisers of the Jabardasth comedy show for breaking the contract.
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs