Advertisement
Google Ads BL

రెడ్ ట్రైలర్: మాస్ vs క్లాస్


ఎప్పుడూ లవర్ బాయ్ లా కనబడే హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ గ కాదు ఊర మాస్ గా భారీ హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ లోని మాస్ అభిమానులకి నచ్చింది. అందుకే ఎప్పుడూ సింపుల్ లవ్ స్టోరీస్ చేసే కిషోర్ తిరుమల కూడా రామ్ ని మాస్ గాను అటు క్లాస్ గాను చూపంచాలని డిసైడ్ అయ్యాడు. రామ్ - కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన రెడ్ ఎప్పుడో ఎనిమిది నెలల క్రితమే తయారైన సినిమా. కానీ కరోనా. అందుకే సంక్రాంతికి రామ్ రెడ్ విడుదల సన్నాహాలు చేస్తూ ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. తాజాగా రామ్ రెడ్ ట్రైలర్ ని విడుదల చేసింది టీం. రెడ్ ట్రైలర్ చూడగానే రామ్ మాస్ లుక్ vs క్లాస్ లుక్ లో అదరగొట్టేసాడు అంటారు.

Advertisement
CJ Advs

మాస్ పాత్రలోనూ, క్లాస్ పాత్రలోనూ రామ్ రెండు రకాల షేడ్స్ తో చెలరేగిపోయాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే ఆదిత్య ఓ అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక ఆ అమ్మాయి మనకి కరెక్టా కాదా అనేది ఓ డెసిషన్ కి వస్తాం. కానీ ఓ అందమైన అమ్మాయిని చూసి తానే తన డెస్టినీ అని ఫిక్స్ అవుతాడు ఆదిత్య. ప్రొఫెషనల్ గా లైఫ్ లో అంతా సెట్ అయ్యింది అనుకున్న టైం లో ఆదిత్య లా ఉండే మరో రామ్ మాస్ ఎంట్రీ కనిపిస్తుంది రెడ్ ట్రైలర్ లో. లైఫ్ లో సెటిల్ అనుకున్న హీరో లైఫ్ లోకి అచ్చంగా అలానే ఉన్న మ‌రో క్రిమిన‌ల్ ప్ర‌వేశిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది రెడ్ క‌థ లా అనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో క్లాస్ రామ్ కన్నా మాస రామ్ నే ఎలివేట్ చేసారు. అంటే సినిమాలో క్లాస్ vs మాస్ అనేది ఓ క్లారిటీ ఇచ్చేసారు.

రెడ్ ట్రైలర్ లో మరో ప్లస్ ఏమిటి అంటే మణిశర్మ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్. కాకపోతే రామ్ డాన్స్ లో మాత్రం అక్కడక్కడా ఇస్మార్ట్ డాన్స్ కనిపిస్తుంది. ‌ఏదైనా రెడ్ ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు. అందుకే రామ్ కూడా పట్టుదలకు పోయి ఎలాగైనా సినిమాని థియేటర్స్ లోనే దింపి హిట్ కొట్టాలనే కసితో కూర్చున్నాడు.  

Red trailer: Class vs Mass:

Ram Red Movie Trailer review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs