Advertisement
Google Ads BL

విన్నర్, రన్నర్ కన్నా సోహైల్ ఫాస్ట్ గా ఉన్నాడు!


బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని జరిగినా నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ కి వస్తున్న ఆఫర్స్, ఫేమ్ ఏ సీజన్ కంటెస్టెంట్స్ కి రాలేదనే చెప్పాలి. మూడు సీజన్స్ లో విన్నర్ అయిన వారికి పెద్దగా అవకాశాలు లేవు. శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ లు ఓ అన్నంత క్రేజ్ తో దూసుకెళ్ళలేదు. కానీ ఈ సీజన్ లో విన్నర్, రన్నర్ కన్నా మూడ్ స్థానంలో నిలిచిన సోహెల్ దూసుకుపోతున్నాడు. అభిజిత్ తో పాటుగా అఖిల్ తో పాటుగా టివి ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తున్న సోహెల్ కి బంపర్ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అభిజిత్ అవకాశాలు వచ్చాయన్నారు కానీ.. ఎక్కడా క్లారిటీ లేడు. ఇక అఖిల్ కి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండబట్టి పెద్దగా అవకాశాల జోరు కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

అభిజిత్ హుందాగా వ్యవహరిస్తుంటే సోహెల్ మాత్రం పరుగులు పెడుతున్నాడు. విన్నర్, రన్నర్ కన్నా సోహెల్ స్పీడు కి అందరూ షాకవుతున్నారు. అభిజిత్తో పాటుగా డబ్బులు పంచుకున్న సోహెల్.. ఇప్పుడు అవకాశాల విషయంలో బిగ్ బాస్ విన్నర్ కన్నా రన్నర్ కన్నా స్పీడుగా ఉన్నాడు. ఇప్పటికే చిరు, బ్రహ్మి లు ఎలాంటి పారితోషకాలు లేకుండా నీ సినిమాలో నటిస్తామంటే ఇప్పడు సోహైల్ హీరోగా సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. ప్రెజర్ కుక్కర్ నిర్మాత.. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో సోహెల్ హీరోగా ఫిబ్రవరిలో సినిమా మొదలెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి సోహెల్ నిర్మాతగా కాదు ముందు హీరోగానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సోహెల్ కి స్టార్ మా కూడా బిగెస్ట్ ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం

బిగ్ బాస్ ఎవరికీ ఎలాంటి మేలు చేసిందో తెలియదు కానీ.. సోహెల్ ని మాత్రం హీరోని చేస్తుంది. ఏదైనా విన్నర్ , రన్నర్ కన్నా సోహెల్ స్పీడు చూస్తే మతి పోతుంది. హౌస్ లోనే కాదు.. బయట కూడా సోహెల్ దూకుడికి ఆయన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Sohail seems to be faster than the winner, the runner!:

<span>Sohel Debut film as hero confirmed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs