సాయి పల్లవి కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరుకాయల లెక్క దూసుకుపోతుంది. స్టార్ హీరోల ఛాన్సెస్ లేకపోతేనేమి.. సాయి పల్లవి నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో సత్తా చాటుతుంది. ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం తో పాటుగా లవ్ స్టోరీ లోను నటిస్తున్న సాయి పల్లవి నాని శ్యాం సింగ రాయ్ లో హీరోయిన్ గాను నటిస్తుంది. అయితే సాయి పల్లవి గతంలో ఓ యాడ్ ని 2 కోట్లు ఇస్తామన్నా చెయ్యనని చెప్పి సన్సేషన్ క్రియేట్ చేసింది అనే ప్రచారం ఉంది. ఓ ఫెయిర్ నెస్ క్రీం కి సాయి పల్లవి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తే 2 కోట్లు పోస్తామన్నా సాయి పల్లవి అప్పట్లో ఒపుకోలేదనే టాక్ నడిచింది. అయితే తాజాగా సాయి పల్లవి ఆ విషయంపై స్పందించింది. నేను సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతానని.. ఫెయిర్ నెస్ క్రీం యాడ్ లో నటించడం, నటించకపోవడమనేది నా వ్యక్తిగత విషయం. ప్రేమమ్ సినిమా చేయకముందు నా మొహం మీద ఉన్న మొటిమలను పోగొట్టుకోవడానికి నేను ఎన్నో క్రీమ్స్ వాడాను.
కానీ నా మొహం మీద ఉన్న మొటిమలు తగ్గల్లేదు. ఎవరైనా నాతో మట్లాడేటప్పుడు నా మొహం మీద మొటిమలను చూస్తూ మాట్లాడేవారే కానీ.. నా కళ్ళల్లోకి చూస్తూ మట్లాడేవారు కాదు. నా మొహంమీద మొటాలు వలన నేను చాలా రోజులు బయటికి రాలేకపోయాను. అలా నా మొహం దాచుకునే దానిని. కానీ ప్రేమమ్ సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను నన్ను గా ఇష్టపడుతున్నారు. దానివల్ల ఎంతోమంది టీనేజ్ అమ్మాయిలు ప్రేరణ పొందారు. అప్పుడే నాలో ఆత్మవిశ్వాసం మొదలైంది. నా సోదరి కూడా తెల్లగా మారడానికి ఇష్టం లేని ఫుడ్ తినేది. అప్పుడే నిర్ణయించుకున్నా.. నేను నాలాగా ఉండాలని.. అందరిలో ఆత్మవిశ్వాసం నింపాలని. అందుకే నేను ఫెయిర్ నెస్ క్రీం యాడ్ చెయ్యడానికి నో చెప్పాను అంటూ సాయి పల్లవి యాడ్స్ వద్దన్న విషయాన్నీ వివరించింది.