Advertisement
Google Ads BL

హోమ్ ఐసోలేషన్ లోకి రజిని!


ప్రస్తుతం సినిమాల విషయం కన్నా రాజకీయాల్లోకి రాబోతున్న రజినీకాంత్ ని మీడియా బాగా హైలెట్ చేస్తుంది. నిన్నమొన్నటివరకు రాజకీయాల విషయం స్పష్టతనీయకుండా సినిమాలు చేసుకుంటున్న రజినీ ఒక్కసారిగా రాజకీయాల గురించి క్లారిటీ ఇచ్చెయ్యడంతో మీడియా అటెన్షన్ అంతా రజినీ మీదే ఉంది. ఈ నెల 31 న తన పార్టీ పేరు, గుర్తు పై వివరణ ఇస్తానని చెప్పిన రజినీకాంత్ తాను ఒప్పుకున్న సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలనే కసితో ఈమధ్యనే ఆయన నటిస్తున్న అణ్ణాతే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో శివ దర్శకత్వంలో అణ్ణాతే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే సినిమాని త్వరగా పూర్తి చెయ్యాలని రజినికాంత్ రోజులో మొత్తంగా 14 గంటల పాటు షూటింగ్ కోసం కష్టపడుతున్నాడనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే రజిని స్పీడుకి తాజాగా కరోనా బ్రేకులు వేసింది. రజినీకాంత్ కరోనా కారణంగా చాలా రోజులు సినిమా షూటింగ్స్ కి హాజరవలేదు. అయితే కరొనకి భయపడకుండా రంగంలోకి దిగిన రజినీకాంత్ ని కరోనా భయపెట్టేసింది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న రజిని అణ్ణాత షూటింగ్ స్పాట్ లోని 8 మందికి క‌రోనా సోకింది. దీంతో ఎంటైర్ యూనిట్ హైద‌రాబాద్ నుండి చెన్నై కి తిరిగొచ్చేశారు. రజినీకాంత్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగెటివ్ అని తేలడంతో ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీనితో అణ్ణాతే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ మ‌రి త‌దుప‌రి షెడ్యూల్‌ను ర‌జినీకాంత్ ఎప్పుడు ప్లాన్ చేస్తార‌ని దానిపై క్లారిటీ లేదు.

Rajini into Home Isolation!:

Super star Rajinikanth Annathe Shooting stopped due to covid effect
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs