Advertisement
Google Ads BL

పవన్ - రానాలకు వాళ్లిద్దరూ సెట్ అయ్యారా!


పవన్ కళ్యాణ్ - రానా కాంబో లో బడా మల్టీస్టారర్ ఓపెనింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ మలయాళ అయ్యప్పన్  కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు అనగానే ఆ సినిమాలో ఏముందో అనే క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో మొదలైంది. దానితో అందరూ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని ఓటిటిలో లో వీక్షించేసారు. అయినా తెలుగు నేటివికి దగ్గరగా, త్రివిక్రమ్ ఏమైనా స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తాడేమో అనే క్యూరియాసిటిలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ - రానా నువ్వా - నేనా అని పోటీ పడే ఈ సినిమాలో వీరి భార్యలుగా కనిపించబోయే హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అయ్యప్పన్ కోషియమ్ లో హీరోలిద్దరికీ పెళ్ళై భార్యలు ఉంటారు. అందులో పవన్ కేరెక్టర్ భార్య పాత్రకి కూసింత నిడివి ఎక్కువ ఉంటుంది. ఆ పాత్ర డీ గ్లామర్ రోల్ తో కూడుకున్నది. అలాగే రానా కేరెక్టర్ వైఫ్ పాత్ర కూడా కీలక పాత్రే కావడంతో ఆ పాత్రల్లో కనిపించబోయే హీరోయిన్స్ ఎవరైతే బావుంటుంది అంటూ పవన్ ఫాన్స్ కూడా ఈ టాపిక్ మీదే సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నాయి. అయితే తాజాగా రానా కేరెక్టర్ కి ఐశ్వర్య రాజేష్ భార్య పాత్ర పోషిస్తుంది అని.. పవన్ భార్య గా సాయి పల్లవి కనిపించే ఛాన్స్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. మరి పవన్ కి సాయి పల్లవి, రానాకీ ఐశ్వర్య రాజేష్ లు అయితే బావుంటారని అంటున్నారు. ఫైనల్ గా దర్శకుడు శేఖర్ చంద్ర ఎవరిని తెస్తాడో అనేది ప్రస్తుతాని కి సస్పెన్స్.

Are they both set for Rana and Pawan ?:

Sai Pallavi and Aishwarya Rajesh in ayyappanum Koshiyum?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs