బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద చిరు వరాల జల్లు చూస్తే ఈ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నారు. ఇక తాను విన్నర్ కానని తెలిసిన సోహైల్ 25 లక్షలు తీసేసుకుని మూడో స్థానంలో నిలబడ్డాడు. ఆ విషయంలో నాగ్ ఫిదా అయ్యి సోహైల్ ని ఎత్తేసుకున్నాడు. ఇక చిరు అయితే సోహైల్ ని తెగ పొగిడేసాడు. అసలు విన్నర్ కన్నా సోహైల్ హైప్ ఎక్కువగా కనబడింది ఆ స్టేజ్ మీద. విన్నర్ కాకపోయినా.. సోహైల్ ని విన్నర్ ని చేసింది బిగ్ బాస్ టీం. అలాగే చిరు, నాగ్ లు సోహైల్ ని అలా హైప్ చెయ్యడంతో సోహైల్ కూడా గాల్లో తేలిపోతున్నాడు. చిరు అయితే నీ సినిమాకి సపోర్ట్ చెయ్యడమేకాదు..ఏకంగా ఓ గెస్ట్ రోల్ కూడా చేస్తా అంటూ మాటిచ్చేసాడు.
చిరు మాత్రమేనా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా సోహైల్ బిగ్ బాస్ గేమ్ కి ముగ్దుడై నీ సినిమాలో నాకో వేషం ఇవ్వు ఫ్రీగా చేస్తా అంటూ సోహైల్ కి ఫోన్ చేసాడట. మరి హాస్య బ్రహ్మ ఫోన్ చెయ్యడం అంటే సోహైల్ రేంజ్ ఎంత ఎత్తుకి పెరిగిందో అనిపిస్తుంది. అయినా ఓ సీరియల్ ఆర్టిస్ట్ గా బిగ్ బాస్ కి పరిచయం అయిన సోహైల్ సినిమా ఎప్పుడు తీయాలి, ఆ సినిమాలో మెగాస్టార్ రేంజ్ పాత్ర ఎప్పుడు సిద్ధం చెయ్యాలి.. అలాగే బ్రహ్మి కి సరిపోయే రోల్ ని ఎలా పెట్టాలి.. అనేది సోహైల్ ఎప్పటికి చేస్తాడో కానీ.. ఇంత పెద్ద స్టార్స్ ని సోహైల్ హ్యాండిల్ చేయగలడా..నరాలు తెగే కోపం, అదరగొట్టే డాన్స్ చేసే సోహైల్ లో మెగాస్టార్ ని, హాస్య బ్రహ్మ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో మొదలైనాయి.