సమంత ఇప్పుడు సినిమాలేమి ఒప్పుకోకుండా ఆహా టాక్ షో సామ్ జామ్ తోనే కాలక్షేపం చేస్తుంది. తమిళనాట విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇద్దరు సూపర్ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి తో కలిసి నటిస్తున్న సమంత తెలుగులో మాత్రం సినిమాలు చెయ్యడం లేదు. కారణాలు చెప్పకుండా అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది సమంత. పెళ్లయ్యాక కూడా గ్లామర్ విషయంలో మరింతగా చెలరేగిపోతున్న సమంత స్కిన్ షో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. భర్తతో కలిసి సాగర తీరాన ఉన్నా, బీచ్ ఒడ్డున బికినీ షో చేసినా, ఆ ఫొటోస్ తో పబ్లిక్ లో సందడి చేసే సమంత తాజాగా హాటెస్ట్ డ్రెస్సులతో రెచ్చిపోతుంది.
రీసెంట్ గా సమంత ఇన్స్టా లో షేర్ చేసిన ఓ వీడియో లో స్టైలిష్ డ్రెస్సులతో సమంత మెరుపులు మాములుగా లేవు. రకరకాల వెరైటీ డ్రెస్సులతో సమంత ఇచ్చిన హాటెస్ట్ ఫోజులు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడమే కాదు.. ఆ వీడియో చూసి ఏంటీ సమంతఈ అరాచకం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. 2020 లో ఫ్యాషనబుల్ గా రెడీ అయ్యి పబ్లిక్ లో తిరగే ఛాన్స్ లేకుండా చేసిన కరొనకి కి సమంత స్టైలిష్ వీడియో చూస్తే కన్ను కుట్టడం ఖాయం. మరి సమంత ఇప్పటికే సాకి అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాదు.. ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ మింత్రా కి బ్రాండ్ అంబాసిడర్ గాను పని చేస్తున్నది ఇప్పటికే భర్త చైతు తో కలిసి మింత్రా ఆన్ లైన్ షాపింగ్ యాడ్స్ లో పాల్గొంటుంది.