Advertisement
Google Ads BL

నీ యోగాసనం చూసి కరోనా పారిపోతుంది!


ఈమధ్యన జిమ్ వర్కౌట్స్ తో బాగా సన్నగా పీలగా తయారైన రకుల్ ప్రీత్ కి కరోనా సోకడం కలకలం సృష్టించింది. ఎప్పుడూ జిమ్, యోగాసనాలు అంటూ బిజీగా ఉండే రకుల్ ప్రీత్ కి ఇప్పుడు చేతిలో సినిమాలతోను కళకళలాడుతుంది. తెలుగులో వైష్ణవ తేజ్ తో నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. నితిన్ తో చెక్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లోను రకుల్ రెండు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్న రకుల్ కి కరోనా వచ్చినట్లుగా గా ఆమె స్వయంగా తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వెవ్ కి దగ్గరవడం ఆందోళ కలిగిస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ కి కరోనా సోకడం ఆమె అభిమానులలో అందోళన కలిగించే విషయమే.

Advertisement
CJ Advs

కానీ రకుల్ కి కరోనా వలన అంతగా ఇబ్బంది లేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్వీట్ చెయ్యడం కాస్త ఊరటనిచ్చింది. అయినా రకుల్ చేసే యోగాసనాలకు కరోనా మహమ్మారి పారిపోవడం ఖాయం. రకుల్ హాట్ యోగాసనాలు, ఆమె జిమ్ వర్కౌట్స్ సోషల్ మీడియాలో తరుచూ చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టే రకుల్ వ్యాయామం విషయంలో అశ్రద్ధ చెయ్యదు. అందుకే తన హాట్ యోగాసనాల ఫొటోస్ ని, జిమ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ హాట్ యోగాసనం పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరి ఇలాంటి భంగిమల్లో రకుల్ ని చూసిన కరోనా కి భయం కలగడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు.

Corona runs away at the sight of your Yogasana!:

Rakul says&nbsp;<span>Flexibility is the key to stability</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs