Advertisement
Google Ads BL

మెగా టచ్ తో అయినా మెరిసిపోవాలి బాస్!


ప్రేమ కావాలి వంటి హిట్ తో హీరోగా లాంచ్ అయ్యి ఆ వెంటనే లవ్లీ తో మరో సూపర్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్  రైసింగ్ యంగ్ స్టార్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇండస్ట్రీలో మంచి అంచనాలు పెంచాడు. అయితే ఆది అదృష్టం మాత్రం అక్కడితో ఆగిపోయింది అనే చెప్పాలి. ఆ తర్వాత అతను చూస్ చేసుకున్న సినిమాలు కానీ, అతను చేసిన ప్రాజెక్ట్స్ కానీ అన్ని ఆదికి నిరాశనే మిగిల్చాయి. జోడి, చుట్టాలబ్బాయి, రఫ్, గాలి పటం, సుకుమారుడు.. ఇలా వరస సినిమాలు ప్లాప్ అయినా ఆది మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Advertisement
CJ Advs

2021 లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి జంగిల్. తెలుగు, తమిళ రెండు భాషల్లో తెరకెక్కిన జంగిల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. రీసెంట్ గా జంగిల్ టీజర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది . అలాగే డిఫరెంట్ లవ్ స్టోరీ గా రూపొందిన శశి సినిమా టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రేపు లాంచ్ చెయ్యబోతున్నారు. రేపే శశి టీజర్ రిలీజ్ ఎందుకంటే రేపు ఆది సాయి కుమార్ బర్త్ డే కాబట్టి.. ఆ అకేషన్ ని ఈ టీజర్ తో సెలెబ్రేట్ చెయ్యబోతున్నారు. మెగా టచ్ తో అయినా సరే మన ఆది సాయి కుమార్ మెరిసిపోవాలని, ఇప్పటికైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలాని ఆశిద్దాం.. హ్యాపీ బర్త్ డే టు ఆది.

Mega Star Chiranjeevi Support to Aadi Sai Kumar:

Chiranjeevi to unveil the teaser of Aadi Sai Kumar Sashi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs