Advertisement
Google Ads BL

మొన్న చెల్లెలి కోసం - నేడు అక్క కోసం


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ ఎక్కువగా బయట కనిపించకుండా తన లుక్ ని దాచేస్తున్నాడు. కరోనా టైం లో ఎన్టీఆర్ పెద్దగా బయట కనిపించలేదు. అభిమానులు గోల చేసినా ఎన్టీఆర్ లో కదలిక లేదు. కారణం ఆయన లుక్ రివీల్ చేయకూడదనే ఉద్దేశ్యం. ఇక మాస్క్ తో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడే కానీ.. ఎన్టీఆర్ లుక్ ఎక్కడా రివీల్ కానివ్వలేదు. కానీ రామరాజు పాత్రధారి రామ్ చరణ్ కి బయటికి రాక తప్పడం లేదు. మొన్న చెల్లెలి నిహారిక పెళ్లి కోసం రామ్ చరణ్ బయటికి వచ్చాడు. నిహారిక పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనడంతో రామరాజు లుక్ దాదాపుగా రివీలయ్యింది. తర్వాత దిల్ రాజు 50 వ పుట్టిన రోజు వేడుకల్లో రామరాజు సందడి చేసాడు.

Advertisement
CJ Advs

ఇక నేడు అక్క సుశ్మిత కోసం మరోసారి రామరాజు బయటికి రాక తప్పలేదు. రామ్ చరణ్ చేతుల మీదుగా సుష్మిత ప్రొడ్యూస్ చేసిన షూట్-అవుట్ ఎట్ ఆలేరు షోరీల్ విడుదల చేసారు. దానితో రామ్ చరణ్ మరోసారి రామరాజు లుక్ లో దొరికిపోయాడు. అయితే ఇప్పటివరకు రామరాజు మీసకట్టులో పర్ఫెక్ట్ గా కనబడని రామ్ చరణ్ ఈ అక్క ఈవెంట్ లో మాత్రం రామరాజుగా పర్ఫెక్ట్ మీసకట్టులో కనిపించాడు. దాపుగా రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో అదే మీస కట్టుతో, అదే లుక్ లో కనిపిస్తాడనేది నేటితో తేలిపోయింది. మరి అక్క చెల్లెళ్ళ కోసం రామ్ చరణ్ ఇలా బయటికి రాక తప్పట్లేదు. అందుకే పదే పదే  రామరాజు లుక్ ని చూపించాల్సి వస్తుంది రామ్ చరణ్. ఇక తాజాగా రామ్ చరణ్ ని రామరాజు లుక్ లో చూసిన మెగా ఫాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.

Day before yesterday For the younger sister, for the older sister today:

Ram Charan RRR Ramaraju Look revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs