Advertisement
Google Ads BL

అదిగో ఆఫర్.. ఇదిగో ఆఫర్.. చివరికి తుస్!


బిగ్ బాస్ సీజన్ 4 ని చప్పగా మొదలు పెట్టి చిరు గెస్ట్ గ్రాండ్ గా ముగించారు. బిగ్ బాస్ సీజన్ 4 బోర్ కొట్టినట్లుగా ఇప్పటివరకు ఏ సీజన్ అంతగా బోర్ కొట్టలేదు. అయినా ఎట్టకేలకు 105 రోజుల బిగ్ బాస్ ముచ్చట ముగిసింది. బిగ్ బాస్ పూర్తయినా దాని వార్తలు సోషల్ మీడియాని వదలడం లేదు. అయితే బిగ్ బాస్ కి వెళ్లి ఎవరు ఏం సాధించారు అంటే.. చెప్పడానికి ఏం కనిపించడం లేదు. ఏదో సీజన్ 3 లో టాప్ 2 వరకు వెల్లిన శ్రీముఖి గతంలో ఎలా ఉందో బగ్ బాస్ కి వెళ్లొచ్చాక కూడా తన యాంకరింగ్ అవకాశంతో అలానే చెలరేగిపోతుంది తప్ప.. అందులో కొత్తగా మరింది ఏం లేదు. ఇక సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ అయితే బిగ్ బాస్ టైటిల్ గెలిచాక మళ్ళి సోది లోకి లేకుండా పోయాడు. ఇక సీజన్ 2 విన్నర్ కౌశల్ అయితే సినిమా అవకాశాలతో, డైరెక్టర్ గా బిజీ అవుతున్నాడు, హీరోగా సినిమాలు మొదలవుతున్నాయ్.. అబ్బో ఆఫర్లే ఆఫర్లు అంటూ తెగ డబ్బా కొట్టినా చివరికి మిగిలింది ఏం లేదు.

Advertisement
CJ Advs

ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సింప్లి గంజ్ కుడా తన ఆల్బమ్స్ తోనూ, సింగర్ గాను బిజీ అయ్యాడు తప్ప రాహుల్ కి బిగ్ బాస్ తో ఒరిగింది ఏం లేదు. తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా వెలిసాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఎనిమిదేళ్ళకి బిగ్ బాస్ ద్వారా మళ్ళీ జనాలకు కనబడిన అభిజిత్ కి బిగ్ బాస్ నుండి బయటికి రాకుండానే ఆఫర్స్ వచ్చేసినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. లైం టైం లో లేకుండా బిగ్ బాస్ కి వచ్చిన అభిజిత్ విన్నర్ అయితే కాగలిగాడు.. కానీ మూడు సీజన్స్ విన్నర్స్ ఎలా ఉన్నారో అభిజిత్ కూడా అలానే ఉంటాడో.. లేదంటే కెరీర్ లో బిజీ అవుతాడో. అప్పుడే చెప్పలేం కానీ.. అభిజిత్ అవకాశాల ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అదిగో ఆఫర్.. ఇదిగో ఆఫర్ అంటున్నారు. మరి చివరికి వాళ్ళ లాగే అభిజిత్ కూడా తుస్ మంటాడో.. లేదంటే పడి లేచిన కెరటంగా దూసుకుపోతాడో చూడాలి.

Offering chances but Finally in the end Tus!:

Abhijith Bagging Offers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs