రంగస్థలం లో ఎంత సకగున్నావే అని అనిపించుకోవాల్సిన అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ కి తృటిలో ఆ అవకాశం తప్పిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు అలాంటి ఆపర్చునిటీ కోసం అనుపమ పరమేశ్వరన్ వెయిట్ చెయ్యని క్షణం లేదు. మళ్ళీ ఖచ్చితముగా అవకాశం ఇస్తానన్న మైత్రి మూవీస్ వారు కానీ, దర్శకుడు సుకుమార్ కానీ ఇంతవరకు అనుపమని పట్టించుకుకోవడం లేదు. అనుపమని తమ నెక్స్ట్ సినిమాల్లో కనీసం చిన్న రోల్ ఇవ్వడానికి కూడా వారు పెద్దగా ఆలోచించడం లేదు.
ఇక అనుపమ పరమేశ్వరన్ మాత్రం ట్రెడిషనల్ గా ఉంటే అవకాశాలు రావేమో అనుకుని.. సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా గ్లామర్ గర్ల్ గా లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ ని షేర్ చేస్తూ ఇండస్ట్రీకి సంకేతాలు పంపుతూనే ఉంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ తనకి టచ్ లో ఉండే త్రివిక్రమ్.. గతంలో అ.. ఆ.. లో ఓ చిన్న కేరెక్టర్ ఇచ్చాడు. మరి మళ్ళీ త్రివిక్రమే అనుపమకు హెల్ప్ చేసి.. తన తదుపరి సినిమాల్లో ఏమైనా మంచి కేరెక్టర్స్ ఇస్తే అనుపమ పరమేశ్వరన్ మళ్లీ కొన్ని రోజులు తెలుగు తెర మీదే కనబడుతుంది. లేదంటే మంచి పెరఫార్మెన్స్ ఇచ్చే అనుపమ లాంటి నటిని తెలుగు సినిమా ఇండస్ట్రీ వదులుకొవాల్సి వస్తుంది.