Advertisement
Google Ads BL

ఏమిటండి ఇది.. మరీ కామెడీగా లేదూ.!


బిగ్ బాస్ హోస్ట్ గా బిగ్ బాస్ ని ప్రమోట్ చెయ్యడంలో తప్పులేదు. కానీ బిగ్ బాస్ ని హైలెట్ చేసేందుకు కామెడీ చెయ్యడం నచ్చడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 మెయిన్ హైలెట్స్ లో నాగార్జున శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ఉన్నాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నాగ్ తీసుకుతిన్న పారితోషకాన్ని పర్ఫెక్ట్ గా పనిచేసాడు.అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బిగ్ బాస్ ని హైలెట్ చేసే క్రమంలో గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నాగార్జున అనిల్ రావిపూడితో చేసిన కామెడీ నిజంగానే కామెడీ అయ్యింది. బిగ్ బాస్ అంటే అనిల్ రావిపూడి ఎంతిష్టమో చెప్పే క్రమంలో నాగార్జున చెప్పినా కథ వింటే ఆహా బిగ్ బాస్ ని ప్రమోట్ చెయ్యడానికి నాగ్ ఇంతలా దిగజారాలా అంటారు.

Advertisement
CJ Advs

అనిల్ రావిపూడి కామెడీ కి అందరూ ఫిదా అయితే అనిల్ రావిపూడి మాత్రం బిగ్ బాస్ కి ఫిదా అంటున్నాడు. బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలంటే వికీ పీడియా కన్నా అనిల్ రావిపూడికే బాగా తెలుసంటున్నాడు నాగ్. బిగ్ బాస్ చూడకుండా అనిల్ రావిపూడి ఉండలేడట. అది ఎంతెలా అంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సరిలేరు నీకెవ్వరూ సినిమా తీస్తున్నప్పుడు బిగ్ బాస్ టైం అంటే రాత్రి తొమ్మిదిన్నర కాగానే ఇప్పుడే వస్తా అంటూ మహేష్ కి చెప్పి పక్కకి వెళ్లి అనిల్ రావిపూడి ఓ గంటసేపు బిగ్ బాస్ చూసి వచ్చాడట. ఓ గంట అనిల్ మాయమవడంతో ఆరా తీసిన మహేష్ అనిల్ రావిపూడి బిగ్ బాస్ చూసొచ్చాడని తెలిసి షాకయ్యాడట. ఈ విషయం మహేష్ స్వయానా నాగ్ కి చెప్పాడట, మరి నాగ్ ఈ కథ చెప్పగానే.. అబ్బబ్బ బిగ్ బాస్ కామెడీ మాములుగా లేదు. అందులోనూ నాగ్ ఇలాంటి ఓ స్టోరీ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పడం మరింత కామెడీగా అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా వ్యాప్తంగా ఆడుకుంటున్నారు.

What is this .. too much comedy on Bigg boss stage!:

Too much sarcasm from Anil Ravipudi and Nag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs