Advertisement
Google Ads BL

టైటిల్ గెలవలేదు.. చిరు మనసు గెలిచాడు!


బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే హీరోయిన్స్ ఆటపాటలతో.. డైరెక్టర్ కామెడీ తో, కంటెస్టెంట్స్ డాన్స్ పెరఫార్మెన్స్ తో నాగార్జున అదిరిపోయే వ్యాఖ్యానంతో బిగ్ బాస్ స్టేజ్ ఓ రేంజ్ లో అదిరిపోయింది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే రోజున హౌస్ లో ఉన్న ఐదుగురిలో ముందు హారిక ఎలిమినేట్ అవగా, తర్వాత అరియనా ఇంటి దారి పట్టింది. ఆ తర్వాత సోహైల్ 25 లక్షలు సూట్కేసు తీసుకుని తనకి తానుగా బిగ్ బాస్ హౌస్ ని వదిలాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకొచ్చి ఓ ఐదులక్షలు ఆర్ఫనైజ్ కి డొనేట్ చేస్తున్నా.. మరో ఐదు లక్షలు మెహబూబ్ కి ఇస్తున్న అనగానే నాగ్ ఫిదా అయ్యిపోయి నేను ఆ 10 లక్షలు అర్ఫానైజ్ కి ఇస్తాను.. నువ్వు 25 లక్షలు తీసుకుని ఇంటికెళ్ళమని చెప్పాడు.

Advertisement
CJ Advs

ఇక చిరంజీవి ఈ సీజన్ గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి నవ్వులు పూయించారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఆహ్లాదకరమైన కామెడీ చేసాడు చిరు. ఇక సోహైల్ ని నువ్వు సింగరేణి ముద్దు బిడ్డవి.. నీ ఆట కి మా ఫ్యామిలీ ఫిదా. కథ వేరుంటాది అనే డైలాగ్ నా సినిమాలో పెట్టకుంటాం.. దానికి నీ పర్మిషన్ కావాలి అని చెప్పిన చిరు.. నువ్వు మటన్ కోసం బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా డిస్పాయింట్ అయ్యావో చూసిన మా సురేఖ నీ కోసం బిర్యానీ పంపించింది. నీ కోసమే ప్రత్యేకంగా మా ఆవిడ వండింది. నువ్వు తిను. పాపం ఆ అబ్బాయికి బిర్యానీ ఇవ్వమని మరీ మరీ చెప్పింది అంటూ సోహైల్ ని తెగ పొగిడేసాడు చిరు. 

అలాగే సోహైల్ నువ్వు అర్ఫానైజ్ కి నీ డబ్బు ఇవ్వొద్దు నేను ఇస్తాను.. నీ డబ్బు నీ పేరెంట్స్ కి ఇవ్వు అని చెప్పడంతో సోహైల్ ఏడ్చేశాడు. మరి సోహైల్ టైటిల్ గెలవకపోయినా చిరు మనసులో ప్లేస్ మాత్రం బాగా సంపాదించుకోవడమే కాదు.. సోహైల్ తియ్యబోయే సినిమాని ప్రోమోట్ చేస్తానని మాటిచ్చిన చిరు.. నీ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ ఇవ్వమని అడగడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.

Didn't win the title, but won Chiru's heart!:

Chiru says about Sohel Bigg boss journey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs