Advertisement
Google Ads BL

సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో సెలబ్రిటీస్ సందడి!


సునీత పెళ్లి తేదీ డిసెంబర్ 27 అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చినా సునీత మాత్రం నా పెళ్లి తేదీ చెప్పేవరకు మీరు ఎలాంటి డేట్స్ రాయకండి అంటుంది. కానీ మీడియా ఊరుకోదు కదా.. సునీత పెళ్లి విషయాలను వదలకుండా రాస్తూనే ఉంది. తాజాగా సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ విషయం బయటికి వచ్చింది. డిసెంబర్ 19 రాత్రి సునీత, కాబోయే భర్త మ్యాంగో రామ్ ప్రీ వెడ్డింగ్ బాష్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఓ రేంజ్ లో జరిగాయి. ఆ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి సినిమా ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ దగ్గరనుండి టాప్ సెలబ్రిటీస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

సునీత - రామ్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి ప్రముఖ యాంకర్ సుమ తో సహా రేణు దేశాయ్, రామ్ సన్నహితులు, సునీత ఫ్రెండ్స్, ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ హాజరై ఎంజాయ్ చేసినట్టుగా ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఆకాశాన్నంటే సంబరంతో జరిగాయనేది ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. సునీత - రేణూ సెల్ఫీ, సుమ కనకాల, రేణు దేశాయ్ సెల్ఫీ, రామ్ తో సునీత కేక్ కటింగ్ ఫొటోస్, మ్యాంగో రామ్ సునీత కలిసున్నా మధుర క్షణాలు.. ఇవన్నీ ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు.. తెగ వైరల్ అయ్యాయి కూడా.

Celebrities at Singer Sunitha - Ram pre-wedding Bash:

Singer Sunitha Pre-Wedding Celebrations 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs