Advertisement
Google Ads BL

సామ్ చిలిపి ప్రశ్నకి.. చిరు తడబాటు!


యాక్టింగ్ విషయం గురించి పక్కనబెట్టి టాక్ షోస్ కోసం పరితపిస్తున్న సమంత ఈ మధ్యన బిగ్ బాస్ సీజన్ 4 లో మామ నాగ్ చెప్పాడని ఓ ఎపిసోడ్ కి హోస్ట్ గా చెయ్యడమే కాదు.. ఆహా కోసం సామ్ జాం అంటూ సెలబ్రిటీస్ తో ఆడుకుంటుంది. ఒకే ఒక్క తమిళ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సమంత ప్రస్తుతం ఆహా టాక్ షో కోసం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చేస్తుంది. రోజుకో స్టార్ తో సమంత సామ్ జామ్ షో ఉంటుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్, క్రిష్ లాంటి స్టార్స్ ఆహా సామ్ జామ్ షోలో సందడి చేసారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరు సెకండ్ ఎపిసోడ్ కే హాజరయ్యారు. కానీ ఇప్పటివరకు తమన్నా, రకుల్ ఎపిసోడ్స్ ని రివీల్ చేసిన టీం తాజాగా మెగాస్టార్ చిరు ఎపిసోడ్ ప్రోమో వదిలింది. అందులో సమంత చిలిపి ప్రశ్నకు చిరు తడబాటు.. అబ్బో అదిరింది.

Advertisement
CJ Advs

సమంత.. చిరుగారు మీ ప్రిజ్ లో ఎప్పుడూ ఉండే ఓ ఐటెం ఏమిటో చెప్పండి అనగానే చిరంజీవి చేతిలో గ్లాస్ టైప్ ఓ మూమెంట్ పెట్టగానే..  అంటే అని సమంత అనగానే.. మీరనుకున్నది కాదు అంటూ చిరు తడబడడం కామెడీగా అనిపించింది. అంటే చిరు తడబాటు చూసిన వారు చిరు వాళ్ళ ప్రిజ్ లో వైన్, విస్కీ ఉంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ చిన్న ప్రోమోతోనే చిరు - సమంత సామ్ జామ్ షో మీద హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది ఆహా టీం. మరి ఫుల్ ఎపిసోడ్ ఎంత ఫన్ గ ఉండబోతుందో చూద్దాం.

To Sam's amusing question .. Chiru's little hesitation!:

Samantha - Chiru SamJam Promo Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs