దాసరి గారి నిష్క్రమణం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం పెద్ద దిక్కు కోల్పోయింది. అయితే ఇకపై నేనున్నాను అంటూ తానే పెద్ద దిక్కుగా అవతరించే ప్రయత్నం చేసారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా క్రైసిస్ టైం లో చిరు ఇండస్ట్రీని ముందుండి నడిపించడం చిరుని అందరూ పెద్ద దిక్కుగా అనుకునే అవకాశాలకు దారినిచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం లేనిపోని చర్చలకు వివాదాలకు తావిస్తుంది. అదేమిటంటే తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ లు బాగా ముచ్చటపడి మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. ఆ సినిమాని తెలుగులో తీసుకురావాలనేది ఆ సినిమాని బాగా ఇష్టపడిన చిరు ప్రయత్నం.
ఈ సినిమా రీమేక్ తాలూకూ ప్రయత్నాలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సుకుమార్ దగ్గర స్టార్ట్ అయ్యి సాహో సుజిత్, వినాయక్, రవీంద్ర ఇంతమంది డైరెక్టర్స్ చుట్టూ తిరిగి చాలా డిస్కర్షన్స్ జరిగి, చాలామంది రైటర్స్ కూర్చుని ఇన్ని చేసి ఫైనల్ గా మెగాస్టార్ చిరు ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజాని లూసిఫెర్ దర్శకుడిగా ఫైనల్ చేసాడు. అయితే తెలుగులో ఇంతమంది డైరెక్టర్స్ ఉండగా.. తెలుగువాడి నాడి తెలిసిన కమర్షియల్ డైరెక్టర్స్ ఇక్కడ పెట్టుకుని పర్టిక్యులర్ గా తమిళ డైరెక్టర్ ని తీసుకొచ్చి లూసిఫెర్ ని రీమేక్ చెయ్యడం కొంతమందికి రుచించడం లేదు.
ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దయ్యి ఉండి.. మనకి మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, మన డైరెక్టర్స్ ని మనమే కించపరుచుకోవడంలా అనిపిస్తుందా అనేది ఒక డిస్కర్షన్ పాయింట్ లా అయ్యింది.. చిరంజీవి గారు ఇది మీ నోటీసు కి వచ్చిందా..!