Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ 4: నో సస్పెన్స్.. విన్నర్ ఫిక్స్!


బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకి టైం దగ్గరపడుతోంది. రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజే అభిజిత్, అరియనా, అఖిల్, సోహైల్, హరికలకి బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి రోజు. ప్రస్తుతం హౌస్ లో సభ్యుల రీ యూనియన్ జరుగుతుంది. ఇక రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చిరు గెస్ట్ గా రాబోతున్నారనే టాక్ వినబడుతుంది. నాగ్ అండ్ చిరు లు బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేయబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.  అయితే టాప్ 5 లో ఉన్న అభిజిత్, అఖిల్, అరియనా, సోహైల్, హరికలలో బిగ్ బాస్ విన్నర్ పై ఎలాంటి సస్పెన్స్ కనిపించడం లేదు. మొత్తం అభిజిత్ వైపే ట్రోఫీ గాలి ఉంది. ప్రతి రోజు ఓటింగ్ విషయంలో అభిజిత్ టాప్ లోనే ఉంటున్నాడు. 50 % ఓట్స్ తో అభిజిత్ టాప్ లో కొనసాగితున్నాడు.

Advertisement
CJ Advs

నిన్నటికి నిన్న కూడా ఆభిజిత్ 50.33% శాతం ఓట్లలో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటె.. ఆ తర్వాత స్థానంలో అరియానా 16. 87% శాతం తోనూ సోహౌల్ 15.35% శాతం ఓట్లతో మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అఖిల్ సార్థిక్ 10.39% శాతం ఓట్లతో నాల్గో ప్లేస్‌లో నిలిస్తే.. హారికా అత్యల్పంగా 7.06% శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచినట్టు సమాచారం. మరి సీజన్ 4 టైటిల్ కోసం అఖిల్, అరియనా, హరిక, సోహైల్ లు పోటీ పడుతున్నా చివరికి అభిజిత్  టైటిల్ ని ఎగరేసుకుపోతాడని.. ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏం లేదంటున్నారు. ఎలాంటి మిరాకిల్స్ జరిగినా అభిజిత్ విన్నర్ అవడం ఎవరూ ఆపలేరంటా అభిజిత్ ఫాన్స్ ఛాలెంజ్ కూడా విసురుతున్నారు.

No Suspense on Bigg Boss season 4 Winner:

Bigg Boss Telugu season 4 Winner Fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs