Advertisement
Google Ads BL

రకుల్ మొదటిసారి..!


రకుల్ అంటే గ్లామర్.. గ్లామర్ అంటే రకుల్ అన్న రేంజ్ లో రకుల్ ప్రీత్ గ్లామర్ షో ఉంటుంది. బికినీ వేసినా మిడ్డీ వేసినా రకుల్ అందాలను అస్సలు దాచిపెట్టదు. జిమ్ డ్రెస్ అయినా, చీర కట్టు అయినా రకుల్ అందాల ఆరబోత సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ తో దూసుకుపోయిన రకుల్ కి టాలీవుడ్ లో స్పీడు బ్రేకులు బాగానే తగిలాయి. అయినా బాలీవుడ్ సినిమాలే నమ్ముకుని కెరీర్ లో ముందుకెళుతున్న రకుల్ ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' నవల ఆధారంగా తెరకెక్కిన ఓ 'లో' బడ్జెట్ మూవీలో నటించింది. ఆ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో.

Advertisement
CJ Advs

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై దర్శకుడు క్రిష్ సైలెంట్ గా ఉంటున్న సమయంలో రకుల్ ఆ సినిమా ముచ్చట్లను ఓ ఇంటర్వ్యూ లో అభిమానులతో పంచుకుంది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుంటే ఓ ముద్ర పడిపోతుంది. ఈ హీరోయిన్ గ్లామర్ షో కి తప్ప మరెందుకు పనికి రాదంటారు. కానీ అప్పుడప్పుడు డీ గ్లామర్ పాత్రలు చెయ్యాలి. అలానే నేను మొదటిసారిగా క్రిష్ సినిమాలో డీ గ్లామర్ పాత్ర లో నటించాను అంతేకాదు.. మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడానని.. ఈ సినిమాలోని డీ గ్లామర్ పాత్ర తనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది అని చెబుతున్నది. అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు ట్రై చేస్తుండాలి అంటూ క్రిష్ సినిమాలో తన కేరెక్టర్ ఓబులమ్మ గా ఉండబోతుంది అని రివీల్ చేసేసింది.

Rakul for the first time ..!:

Rakul Preet Singh as Rayalaseema Obulamma Character in Krish Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs