Advertisement
Google Ads BL

పెళ్లికళ వచ్చేసిందే బాల..!


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లాక్ డౌన్ పెళ్లిళ్లు కేక పెట్టిస్తున్నాయి. రానా దగ్గరనుండి నిఖిల్, నితిన్. కాజల్ అగర్వాల్ నిన్నగాక మొన్న నిహారిక పెళ్లిళ్లు సింపుల్ గా ఇండస్ట్రీ ప్రముఖులకు దూరంగా జరిగిపోయాయి. తాజాగా మరో సెలెబ్రిటీ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారనుంది. అదే సింగర్ సునీత సెకండ్ మ్యారేజ్. ఈమధ్యనే రామ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సునీత త్వరలోనే అంటే ఈ నెల 26 నే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా సమాచారం. సునీత పెళ్లి డిసెంబర్ 26 న మంచి ముహూర్తం ఉండడంతో ఇరు పెద్దలు అదే తేదీని నిశ్చయించినట్టుగా తెలుస్తుంది. మరి పెళ్లి అంటే బట్టల షాపింగ్ ,నగల షాపింగ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్.

Advertisement
CJ Advs

అందుకే సునీత ప్రస్తుతం బట్టల షాపింగ్ లో బిజీగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రముఖ బట్టల దుకాణం ముగ్ద ఆర్ట్ స్టూడియోస్ బట్టల దుకాణం ఓపెనింగ్ లో సునీత స్పెషల్ గా మెరిసిపోయింది. ముగ్ద ఆర్ట్ స్టూడియోస్ ఓపెనింగులో రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ వంటి తారామణులు ఉన్నపటికీ.. సునీత కొత్త పెళ్లి కూతురులా స్పెషల్ గా కనబడుతుంది అంటే సునీత మోహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. రామ్ తో ఏడడుగులు వెయ్యడానికి సిద్ధపడిన సునీత ఇప్పుడు ఈ బట్టల షాప్ ఓపినింగ్ లో ప్రత్యేకంగా కనబడుతూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నిజంగా ఆ చీరల మధ్యన సునీతని అలా చూస్తుంటే పెళ్లికళ వచ్చేసిందే బాలా అని అనకుండా ఉండలేరు. రామ్ అయితే ఏకంగా మైమరిచిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు.

Singer Sunitha Wedding date Locked:

Singer Sunitha Wedding date fixed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs