బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎక్కడ కనిపించినా, హోటల్స్, లొకేషన్స్ లో, ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ కనిపించినా జనాలు సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి అయ్యిపోయింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి పాపులర్ అవడం కామన్ అయ్యింది. అయితే ఇక్కడ ప్రభాస్ ఫాన్స్ ని టెంక్షన్ పెట్టిన మ్యాటర్ ఏమిటంటే.. ప్రభాస్ లుక్స్. అయితే 'సినీ జోష్' సాధించిన సమాచారం మేరకు రాధేశ్యాం మూవీలో ప్రభాస్ లుక్స్ 'అదరహో డార్లింగ్' అనిపించేలా ఉంటుంది.
అంతెందుకు ఆదిపురుష్ మూవీ కోసం ప్రభాస్ ని కలవడానికి వచ్చిన బాలీవుడ్ తనాజీ డైరెక్టర్ ఓం రౌత్.. జస్ట్ క్యాజువల్ గా రాధేశ్యాం రష్ చూసి 'హి ఈజ్ మై రామ్, వాట్ ఏ మ్యాగ్నిఫయింగ్ పర్సన్' అంటూ బాగా ఎగ్జైట్ అయ్యిపోయారంట. సో ఇది చాలుగా.. ఈ Example చాలుగా.. అందుకని జస్ట్ ప్రభాస్ ఫాన్స్, జస్ట్ రిలాక్స్. 2021 లో ప్రభాస్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ డార్లింగ్ దున్నేస్తాడు.. దుమ్ముదులిపేస్తాడని ఆశిద్దాం.