Advertisement
Google Ads BL

రాజు గారి పార్టీలో వాళ్ళెక్కడ?


కరోనా లాక్ డౌన్ లో దిల్ రాజు రెండో పెళ్లి పెద్దగా న్యూస్ లోకి రాలేదు. లేదంటే దిల్ రాజు మళ్ళీ పెళ్లి.. ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అయ్యేది. ఇక దిల్ రాజు రెండో పెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిపోయింది. అదిగో అప్పటినుండి ఇండస్ట్రీ ప్రముఖుల్ని పిలిచి పార్టీ ఇవ్వలేకపోయాడు. కరోనా వలన దిల్ రాజు పెళ్లి పార్టీ జరగలేదు. అందుకే ఇప్పుడు దిల్ రాజు తన 50 వ పుట్టిన రోజు వేడుకలని ఘనంగా జరుపుకున్నాడు.  తన కొత్త భార్యని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకున్నాడో.. లేదంటే 50 ఏళ్ళ పుట్టిన రోజు పార్టీ గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాడో కానీ.. స్టార్ హీరోలకు దిల్ రాజు బడా పార్టీ ఇచ్చాడు. దిల్ రాజు కొత్త భార్య తో కలిసి ఇండస్ట్రీ లోని స్టార్ హీరోలకి అదిరిపోయే బర్త్ డే పార్టీ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

గత రాత్రి దిల్ రాజు 50 వ పుట్టిన రోజు వేడుకలు ఓ హోటల్ లో గ్రాండ్ గా జరిగాయి. దిల్ రాజు పార్టీకి రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, పవన్ కళ్యాణ్, చిరు, రామ్, నితిన్, రాశి ఖన్నా, పూజ హెగ్డే, అంజలి లాంటి స్టార్స్ అందరూ హాజరయ్యారు. అలాగే ఎఫ్ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడి, కన్నడ స్టార్ హీరో యాష్ దిల్ రాజు పార్టీలో సందడి చేసారు. అయితే స్టార్స్ హడావిడిలో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నాగ్ తరపున కొడుకులు అఖిల్, చైతు, కోడలి సమంత హాజరయ్యారు. అది ఓకె. కానీ బాలయ్య ఫ్యామిలిలో ఎవరూ కనబడలేదు. అలాగే ఎన్టీఆర్ కూడా రాలేదు. ఇంకా వెంకటేష్ కానీ సురేష్ బాబు కానీ రానా కానీ దిల్ రాజు పార్టీలో కనబడలేదు.  

అంతేకాకుండా దిల్ రాజు పార్టీకి చిన్న హీరోలకి ఆహ్వానం కూడా లేనట్టుగా ఉంది. అలాగే దర్శకులలో అనిల్ రావిపూడి తప్ప ఇంకెవరు కానరాలేదు. వాళ్ళని పిలవలేదా? పిలిచినా రాలేదా? అనేది ఇప్పడు చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ బర్త్ డే పార్టీలో దిల్ రాజు కొత్త భార్య తో కలిసి కళకళలాడాడు. కూతురు అల్లుడు తో దిల్ రాజు పుట్టినరోజు కుర్రాడిలా మెరిసిపోయాడు. 

Didn't Dil Raju invite them?:

So many Celebrities Missing in Dil raju Birthday Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs