పెళ్లి చేసుకున్నాక హీరోయిన్స్ కి అవకాశాలు రావు అనేది పాత మాట. వచ్చినా వాడుకోవడం లేదు.. తీసుకోవడం లేదు అనేది సమంత బాట. ఎస్ థట్స్ ట్రూ. నిజానికి పెళ్లి తర్వాతే రంగస్థలం, మహానటి, మజిలీ, ఓ బేబీ వంటి గ్రాండ్ హిట్స్ ఇచ్చిన సమంత తర్వాత నటిగా తనకొచ్చిన అవకాశాలను పక్కనబెట్టి ఓటిటి వైపు అడుగులు వేసింది. ఫ్యామిలీ మ్యాన్ లో నటించేందుకు ఉత్సాహాన్ని చూపించింది. అది కూడా ఓకె అనుకుంటే ఇప్పుడు అందరిని ఆహా అనిపిస్తా అంటూ సామ్ జామ్ అనే టాక్ షో మొదలు పెట్టింది.
అయితే ఆ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ నుండే ప్లాప్ షో గా మారిపోవడం ఇటు ఆహా వారితో పాటు, అందరిని డిస్పాయింట్ చేసింది. విజయ్ దేవరకొండ, తమన్నా లాంటి స్టార్స్ వచ్చినా.. రేపు చిరంజీవిని తెచ్చినా.. ఇప్పటికీ ఆ షో పై క్రేజ్ రాకపోవడం అటు సమంత ఫాన్స్ నే కాదు ఇటు అక్కినేని ఫాన్స్ అందరిని నిరాశలో ముంచేసింది. అందుకే ఫాన్స్ అందరూ కూడా పెరఫార్మెర్ గా ఎంతో పొటన్షియాలిటీ ఉండి సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన సమంత లాంటి ఓ నటి ఇలా ఒక టాక్ షో కి పరిమితమైపోవడం, ఇలా సామ్ జామ్ జాటం ఎందుకు మాకు అనే డిస్కర్షన్స్ సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా జరుగుతున్నాయి.
సామ్ వింటున్నావా.. చూస్తున్నావా..