Advertisement
Google Ads BL

నాని ప్రెజెంట్ ట్రాక్ రికార్డ్ కి మరో హాని.!


హీరో నాని కి మీడియం రేంజ్ హీరోలందరి కన్నా కూసింత క్రేజ్ ఎక్కువే ఉంది. వరస సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్స్ తో ఎపుడూ బిజీగా ఉండే నాని.. వీలయితే ఏడాదికి రెండు సినిమాలు థియేటర్స్ లో దింపేస్తాడు. కానీ ఈ ఏడాది కరోనా నాని స్పీడుకి బ్రేకులు వేసింది. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నాని విలన్ గా నటించిన 'వి' సినిమాని ఎక్కువగా నాని 25 వ సినిమాగానే ప్రమోట్ చేసారు. నాని 25 వ సినిమాగా ప్రచారం జరిగిన 'వి' సినిమా థియేటర్స్ లో విడుదల చేసి ఆనందించాలి అనుకుంటే కోవిడ్ నాని ఆశలపై నీళ్లు చల్లింది. ఇక అమెజాన్ ప్రైమ్ వారు భారీ డీల్ ఇవ్వడంతో ఓటిటికి అమ్మేసి.. భారీ ప్రమోషన్స్ చేసి విడుదల చేసారు ఇంద్రగంటి అండ్ టీం.

Advertisement
CJ Advs

ఓటిటి లో విడుదలైన రోజు ఓకె అనిపించుకున్న 'వి' సినిమాని హిట్ అనుకున్నారు. అంతలా నాని, ఇంద్రగంటిల ప్రమోషన్స్ ఉన్నాయి. కానీ తర్వాత 'వి' సినిమాని ప్లాప్ గా తెలిచేసారు ట్రేడ్ పండితులు. ఓటిటి లో ప్లాప్ అయిన 'వి' సినిమాని తాజాగా శాటిలైట్ హక్కులు చేజిక్కించుకున్న జెమిని ఛానల్ వారు వర్ల ప్రీమియర్ అంటూ హైప్ క్రియేట్ చేసి మరీ ఓ ఆదివారం సాయంత్రం ప్రసారం చెయ్యగా 'వి' సినిమాకి వీక్ టీఆర్పీస్ వచ్చినట్టుగా సమాచారం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులముందుకు వచ్చిన 'వి' సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వి సినిమాకి కేవలం 6.8 టీఆర్పీ వచ్చింది. మరి నాని గత చిత్రాలకు ప్లాప్ టాక్ పడినా.. బుల్లితెర మీద ఇంత దారుణమైన టీఆర్పీస్ రాలేదు. కానీ 'వి' సినిమా మరీ దారుణమైన టీఆర్పీ సొంతం చేసుకుని బుల్లితెర మీద ప్లాప్ షో గా మిగిలిపోయింది. 

Another damage to Nani's present track record!:

Nani 'V' Failed To Impress The Small Screen Audience
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs