Advertisement
Google Ads BL

మహేష్ లుక్ పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!


మహేష్ బాబు అందగాడు, స్టైలిష్ లుక్స్ ఉన్న హ్యాండ్ సమ్ గై. అమ్మాయిల కలల రాకుమారుడు.. అందరు హీరోయిన్స్ కి అందని ద్రాక్ష మహేష్. అయితే మహేష్ లుక్ కి, ఆయన అందానికి పడని అమ్మాయిలు ఉండరు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మహేష్ లుక్ కి పడిపోయిందట. మరి ఆ హీరోయిన్ కూడా అల్లాటప్పా హీరోయిన్ కాదు.. అలాగే మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేయాలని చూసే హీరోయి అంతకంటే కాదు. ఆమె రౌడీ బేబీ సాయి పల్లవి. మహేష్ పక్కన సాయి పల్లవికి ఎప్పుడో అవకాశం వచ్చింది. ముద్దు సన్నివేశాల వలన మహేష్ సినిమానే రిజెక్ట్ చేసిన టాలంటేడ్ హీరోయిన్ సాయి పల్లవి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మహేష్ అందానికి ఫిదా అంటుంది. మహేష్ అందానికి తాను ఎంతగా ఫిదా అవుతానో చెప్పలేనంటుంది. మహేష్ చాలా అందంగా హ్యాండ్ సమ్ గా ఉంటాడని..మహేష్ స్కిన్ ఎప్పుడూ మెరిసిపోతుంది అంటూ చెప్పడమే కాదు.. ఈ బ్యూటీ మహేష్ ఫొటోస్ ని చూస్తున్నప్పుడు జూమ్ చేసి మరీ చూస్తుందట.. ఎందుకంటే మహేష్ ఫేస్ మీద చిన్న మచ్చయినా పట్టుకుందామని. కానీ మహేష్ మొహంపై చిన్న మచ్చ కూడా కనిపెట్టలేమంటుంది. అసలు ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాడో అంటూ తెగ షాకైపోతుంది సాయి పల్లవి. మహేష్ లేటెస్ట్ హ్యాండ్ సమ్ లుక్స్ ఈమధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు..ఇలా హీరోయిన్స్ ని ఫిదా చేస్తున్నాయన్నమాట.

Heroine interesting comments on Mahesh look!:

Sai Pallavi comments on Mahesh Babu's Looks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs