Advertisement
Google Ads BL

అవకాశాల వెల్లువలో బిగ్ బాస్ బ్యూటీ!


'బిగ్ బాస్ 4'తో వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి దివి వడ్త్య. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లడానికి ముందే తెలుగు ప్రేక్షకులకు ఆమె కొంతవరకు తెలుసు. 'మహర్షి'లో నటించారు. మోడల్‌గానూ షోస్‌లో సందడి చేశారు. అయితే, 'బిగ్ బాస్' ద్వారా బుల్లితెర వీక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు దివి మరింత దగ్గరయ్యారు. నటిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా ఆమెను అభిమానిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. దివి నవ్వు, సొట్టబుగ్గలతో యువత ప్రేమలో పడ్డారంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులలో దివికి క్రేజ్ వచ్చింది. అలాగే, అవకాశాలు కూడా వెల్లువలా వస్తున్నాయి.

Advertisement
CJ Advs

అందంగా కనిపించడంతో పాటు చక్కటి అభినయం ప్రదర్శించగల కథానాయిక పాత్రలకు దివి మంచి ఆప్షన్ అని టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారు. ఆమెను సంప్రదిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, మంచి కథలు చేయాలని దివి వడ్త్య అనుకుంటోందని ఆమె సన్నిహితులు చెప్పిన దాన్నిబట్టి తెలుస్తోంది. 

రెండు మూడు చిత్రాల్లో దివి వడ్త్య కథానాయికగా ఎంపికైందనీ... పూర్తి వివరాలు త్వరలో ఆయా దర్శక, నిర్మాతలు వెల్లడిస్తారని సమాచారం.

Lucky Chance for Bigg Boss Beauty!:

Crazy offers on Bigg boss beauty Divi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs