Advertisement
Google Ads BL

రామ్ పట్టుపట్టాడు.. నితిన్ నిలబడగలడా?


యంగ్ హీరోలో ఇద్దరు హీరోలు నితిన్, రామ్ మంచి హిట్ సినిమాలతో ఉత్సాహంగా తమ తదుపరి సినిమా షూటింగ్స్‌ని పూర్తి చేసుకుంటున్నారు. రామ్ అయితే ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ కొట్టాడు. చాలా రోజులకి తగిలిన హిట్‌తో రామ్ ఉత్సాహంతో రెడ్ సినిమా చేశాడు. ఆ సినిమా విడుదల అనుకుంటున్న సమయానికి కరోనాతో థియేటర్లు మూత పడ్డాయి. అన్ని సినిమాలకు ఎగబడినట్లే.. ఓటిటి వాళ్ళు రామ్ రెడ్ కోసం ఎగబడ్డారు కానీ రామ్ మాత్రం ఇస్మార్ట్ హిట్ తో ఉన్నాను.. నా సినిమా థియేటర్స్‌లో విడుదల అవ్వాల్సిందే అన్నాడు. వచ్చే సంక్రాంతికి రెడ్ విడుదల చెయ్యడానికి రెడీ అయ్యాడు.

Advertisement
CJ Advs

ఇక భీష్మతో భారీ హిట్ కొట్టిన నితిన్ - వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రంగ్ దే షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినా రంగ్ దే వెంట ఓటిటి సంస్థలు బడా ఆఫర్స్ ఇస్తూ నితిన్ వెంట పడుతున్నారు. రంగ్ దే సినిమాకి భారీ ధర ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. కానీ భీష్మ హిట్ అయ్యాక ఓటిటికి ఎలా అంటూ నితిన్ కూడా రంగ్ దే ని థియేటర్స్‌లోనే దింపుతా అని అది కూడా సంక్రాంతికి అంటూ పోస్టర్స్ వదిలారు. కానీ ఇప్పుడు భీష్మ కోసం ఓటిటి సంస్థల వెంపర్లాట చూసిన రంగ్ దే నిర్మాతలు టెంప్ట్ అయ్యేలా ఉన్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ నితిన్ మాత్రం రంగ్ దే థియేటర్స్ లోనే అంటున్నాడట. మరి రామ్ పట్టుబట్టుకుని ఉన్నట్టుగా నితిన్‌కి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. నిర్మాతల ఒత్తిడితో నితిన్ కూడా ఓటిటి ఆఫర్‌కి టెంప్ట్ అయితే.. నితిన్ రంగ్ దే జీ 5కి దక్కేలా కనబడుతుంది.

Hero Ram Strong.. What about Nithiin?:

Tempting Offters to Red and Rang de from OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs