Advertisement
Google Ads BL

రవితేజకి రంగమ్మత్తకి ఇంట్రెస్టింగ్ ఫైట్


రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంశలు అందుకున్న అనసూయ.. ప్రతి వారం జబర్దస్త్ లో కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. అయితే అనసూయ సినిమాల ఎంపిక లో మాత్రం ఆచి తూచి వ్యవహరించడం విశేషం. సినిమాల ఎంపికలో చాలా సెలెక్టీవ్ గా ఉంటూ వస్తోన్న అనసూయ రీసెంట్ గా రవితేజ సినిమాకి మాత్రం సింగిల్ సిట్టింగ్ లో ఇమ్మిడియట్ గా ఓకె చెప్పేసి నెక్స్ట్ డే లొకేషన్ కి కూడా వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజా - రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్ర చెయ్యడానికి ఇమ్మిడియట్ గా ఓకె చెప్పిందట.

Advertisement
CJ Advs

అయితే రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ ఒప్పుకున్న ఆ కీలక పాత్ర అల్లాటప్పా పాత్ర కాదని అల్లాడించే కారెక్టర్ అని, రవితేజ పాత్రతో అనసూయ పాత్ర ఢీ అంటే ఢీ అనే పాత్ర అని, రవితేజ - అనసూయ  మధ్యన హోరాహోరి ఫైట్ ఉండబోతుందని సమాచారం. అందుకే అనసూయ ఈ పాత్రకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. రంగంలోకి దిగిపోయిందేమో.!

దీనిని బట్టి అనసూయ రవితేజ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తోందో ఆడియెన్స్ ఈజీగా గెస్ చేసేస్తారు.. ఎందుకంటే అసలు ఖిలాడీలు వాళ్లేగా !!

Interesting fight between Ravi Teja and Rangammatta:

Anchor Anasuya Interesting role in Khiladi movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs