Advertisement
Google Ads BL

సలార్ ప్రభాస్ క్రేజ్ కి సలామ్ బాస్!


ప్రభాస్ రేంజ్, క్రేజ్ కి ఇప్పుడు ఇండియా వైడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాహుబలి కటౌట్ మరిచిపోక ముందే సాహో తో బాలీవుడ్ ని అల్లాడించాడు. ప్రస్తుతం రాధేశ్యాం, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సాలార్ సినిమాలతో ఫ్యాన్ ఇండియా ని గడగడలాడించడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలితోనే ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం వస్తే చిన్న నటుడైన, స్టార్ నటుడైన ఎందుకాగుతారు. అందులోనూ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే మాములు విషయం కాదు కదా.

Advertisement
CJ Advs

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో నటించేవారి కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి నటించే ఏ చిన్న అవకాశం వదలం అంటూ రోడ్ల మీద క్యూ కట్టేసారు. చాలామందికి సినిమా అంటే పిచ్చ ఉంటుంది. అందులోను ప్రభాస్ సినిమా అంటే మరింత ఆసక్తి ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని వదలం అంటున్నారు. నో ఏజ్ లిమిట్ అంటూ సాలార్ టీం ఇచ్చిన ప్రకటనతో సలార్ ఆడిషన్స్ కోసం వేలల్లో ఆడిషన్స్ కి హాజరయ్యారు. ప్రస్తుతం  ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన వారి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదంతా చూస్తుంటే ప్రభాస్ కి పబ్లిక్ లో ఎంత క్రేజ్ ఉందొ తెలుస్తుంది. ఏదైనా ప్రభాస్ క్రేజ్ కి సలామ్ కొట్టాల్సిందే.

Prabhas craze in public is not normal right??!!:

Prashanth neel - Prabhas Salaar audition 2020
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs