అభిమానులు ఎప్పటినుండో ఊరిస్తున్న రజినీకాంత్.. ఎట్టకేలకు పాలిటిక్స్ లోకి దిగిపోయాడు. పొలిటికల్ పార్టీ పెట్టి సింగిల్ గానే పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించేశాడు. నిన్నటివరకు పార్టీ గుర్తు, పేరు మీద కసరత్తులు చేసిన రజినీకాంత్ టీం నేడు పొలిటికల్ పార్టీ, పేరు గుర్తుని ఫైనల్ చేసేసారు. రజిని పొలిటికల్ పార్టీ గుర్తు ఏమిటో తెలుసా రజినీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాషా సినిమాలో ఆటోని తన పార్టీ గుర్తుగా పెట్టుకున్నాడు. నేనాటోవాన్ని ఆటోవాన్ని అంటూ బాషా సినిమాలో ఆటో నడిపిన రజినీకాంత్ చివరికి ఆటోనే నమ్ముకున్నాడు. గుర్తు మాత్రమే కాదు పార్టీ పేరు కూడా బయటికి వచ్చింది.
రజిని పొలిటికల్ పార్టీ పేరు 'మక్కల్ సేవై కర్చీ' గా ఉండబోతుంది. అంటే ప్రజాసేవ పార్టీగా రజిని పార్టీ పేరు ఉంటుంది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట సంచనాలకు తెర లేపేందుకు రజిని గట్టిగానే కృషి చేస్తున్నాడు. ఇక రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో ని చూడగానే రజిని ఆటో ఎక్కాడు.. బాషా సినిమాలో రజినీకాంత్ లా ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు ప్రజలకి న్యాయం చెయ్యడానికి, సేవ చెయ్యడానికి వచ్చినట్టుగా ఉంది ఆ గుర్తు చూస్తుంటే.. బాషా సినిమాలా రజినీకాంత్ పార్టీ ప్లాన్ ఉంది అంటున్నారు ఆయన అభిమానులు. మరి సినిమాల్లో రజినీకాంత్ మీదున్న అభిమానం పొలిటికల్ గా కూడా రజిని మీద ఉంటే మంచిదే. లేదంటే రాజకీయంగా రజిని అన్యాయమైపోవడం ఖాయం.