బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం చివరిగా ఎలిమినేట్ అయిన మోనాల్ మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేఖత ఉంది. మోనాల్ అసలు హౌస్ లో ఉండేందుకు అర్హురాలు కాదంటూ బుల్లితెర ప్రేక్షకులు నానా రచ్చ చేసినా బిగ్ బాస్ పట్టించుకోకుండా 14 వారాలు ఆమె హౌస్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్లిన ప్రతి కంటెస్టెంట్ వాళ్ళ క్రేజ్ ని బట్టి పారితోషకం ఉంటుంది అనేది తెలిసిందే. బిగ్ బాస్ లో మాజీ హీరోయిన్ స్థాయిలో అడుగుపెట్టిన మోనాల్ కి ఎంత పారితోషకం ఇచ్చారో బిగ్ బాస్ యాజమాన్యం అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. మరి మోనాల్ 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది అంటే సామాన్యమైన విషయం కాదు. 14 వారాలంటే 98 రోజులపాటు హౌసులో ఉంది మోనాల్.
అయితే మోనాల్ కి బిగ్ బాస్ యాజమాన్యం గ్లామర్ గా ఉండేలా ముందే ఒప్పందం చేసుకుంది అని.. బిగ్ బాస్ యాజమాన్యం ఆదేశాలమేరకు మోనాల్ అందాల ఆరబోత ఉంది అనేది లేటెస్టుగా బయటికొచ్చిన న్యూస్. ఇక మోనాల్ కి రోజుకి ఇంత పారితోషకం అంటున్నారు. అంటే ఒక్కరోజు హౌస్ ఉన్నందుకు మోనాల్ 30 వేల పారితోషకం అందుకుంది అని.. అలా ఓవరాల్ గా 98 రోజులకి కలిపి 29 లక్షల 60 వేల రూపాయలు అందుకుంది అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం క్రేజ్ లో లేని మోనాల్ గ్లామర్ విలువ రోజుకి 30 వేలన్నమాట. సో ఇలా బిగ్ బాస్ హౌస్ లో మూడు నెలలు అందాలు ఆరబోసినందుకు 30 లక్షల పారితోషకంతో మోనాల్ ఇంటికి వెళ్ళింది అంటున్నారు.