Advertisement
Google Ads BL

బిగ్ బాస్ విన్నర్ ని ఫైనల్ చేసిన రౌడీ స్టార్!


బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వీక్ లో ఐదుగురు కాంట్రస్టెంట్స్ బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. అఖిల్, అభిజిత్, సోహైల్, హారిక, అరియనాలు టాప్ లో ఉన్నారు. మరి వచ్చే ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ డిసైడ్ అయ్యేకన్నా ముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ పై రకరకాల పోల్స్ నిర్వహిస్తున్నారు. అందులో సోహైల్ విన్నర్ అని, అభిజిత్ విన్నర్ అంటూ ఆ రెండు పేర్లు గట్టిగా వినబడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రమే అభిజిత్ పై అభిమానుల అభిమానం ట్రేండింగ్ లోకొస్తుంది. అభిజిత్ విన్నర్ అంటూ చాలామందే ఫిక్స్ అయ్యారు. అభిజిత్ ముందు నుండి టైటిల్ రేసులో ఉన్నాడు. అభిజిత్ కూల్ పర్సన్ అయినా టాస్క్ విషయంలో కాస్త మైనస్ ఉన్న కారణంగా అందరూ 100 శాతం ఫిక్స్ కాలేకపోతున్నారు.

Advertisement
CJ Advs

కానీ సినిమా సెలబ్రిటీస్ మాత్రం అభిజిత్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ మాత్రమే కాదు.. నాగబాబు, శ్రీకాంత్ లాంటి స్టార్స్ అభిజిత్ విన్నర్ అవుతాడంటా గెస్ చేస్తున్నారు. తాజాగా అభిజిత్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆశీస్సులు కూడా దక్కాయి. మరి విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఈ వారం అభిజిత్ కి యూత్ మొత్తం ఓట్లు గుద్దేస్తారు. దానితో అభిజిత్ విన్నర్ అంటూ అప్పుడే అభిజిత్ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ అభిజిత్ తో ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 'మై బాయ్స్.. ఎప్పుడైనా, ఎక్క‌డైనా వారికి మంచే జ‌ర‌గాలి' అంటూ.. అభికి మద్దతుని అందిస్తున్నాడు. 

విజయ్ దేవరకొండ సైడ్ కేరెక్టర్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అభిజిత్ హీరో. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ హీరో.. అభిజిత్ సైడ్ అయ్యాడు అది వేరే విషయం. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ నోట అభిజిత్ పేరు విన్న యూత్ అయితే అభిజిత్ కి ఓట్లు గుద్దెయ్యడమే కాదు అభిజిత్ విన్నర్ అయ్యేవరకు ఊరుకోరు. 

The rowdy star finalized Bigg Boss winner!:

Bigg boss 4: Vijay devarakonda Supports Abhijeeth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs