ఈ ఏడాది ప్రేక్షకులకు ఒక్క భారీ బడ్జెట్ సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతికి విడుదలైన సినిమాలు తప్ప మళ్ళీ పెద్ద సినిమా థియేటర్స్ లో పడలేదు. కరోనా కారణంగా అంతా అతలాకుతలం అయ్యాయి. అయితే కరోనా కారణం కొన్ని షూటింగ్స్ బ్రేక్ పడితే.. మరికొన్ని విడుదల ఆగిపోయాయి, ఇంకొన్ని థియేటర్స్ బంద్ తో ఓటిటి బాట పట్టాయి. సోషల్ మీడియా బోసి పోయింది. స్టార్ హీరోల అప్ డేట్స్ కోసం అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో సౌత్ హీరోల అప్ డేట్స్ కోసం అభిమానులు చేసిన ట్వీట్స్ లో నెంబర్ 1 లో విజయ్ మాస్టర్ నిలిచింది.
విజయ్ మాస్టర్ అప డేట్స్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చెయ్యడంతో విజయ్ మాస్టర్ ట్విట్టర్ లో నెంబర్ వన్ లో ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ అప్ డేట్స్ కోసం ట్వీట్స్ చేసారు. అలా మాస్టర్ తర్వాత స్థానంలో పవన్ వకీల్ సాబ్ నిలిచింది. విజయ్ మాస్టర్ కరోనా రాక ముందే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిధ్దమైన కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక వకీల్ సాబ్ షూటింగ్ కరోనా కారణంగా బ్రేకివ్వాల్సి వచ్చింది. అందులోనూ అది పవన్ కం బ్యాక్ మూవీ కావడంతో పవన్ ఫాన్స్ పిచ్చ క్యూరియాసిటీతో ఉన్నారు. ఇక విజయ్ మాస్టర్, పవన్ వకీల్ సాబ్ తర్వాత అజిత్ వాలిమై అప్ డేట్స్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్ చేసారు.
తర్వాత స్థానాల్లో మహేష్ సర్కారు వారి పాట, సూర్య సురరై పోట్రు, ఆ తర్వాత RRR అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ తెగ వెయిట్ చేసారు. RRR తర్వాత అల్లు అర్జున్ పుష్ప, తర్వాత స్థానాల్లో సరిలేరు నీకెవ్వరూ, కెజిఎఫ్ చాప్టర్ 2, దర్బార్ చిత్రాల అప్ డేట్స్ కోసం అభిమానుల ట్వీట్స్ ట్రేండింగ్ లోకొచ్చాయి.