Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ డైలాగ్స్ తో రామాయణం.. భళా స్వామి!


ప్రస్తుతం ఇండియాలోని అన్ని భాషల దర్శకనిర్మాతల నోట మహాభారతం మాటే వినబడుతుంది. టాలీవడో టాప్ దర్శకుడు రాజమౌళి దగ్గరనుండి.. బాలీవుడ్ దంగల్ దర్శకుడు వరకు చాలామంది దర్శకుడు ఈ పురాణం ఇతిహాసాలు తెరకెక్కించే ప్లాన్స్ చేస్తున్నారు. రాజమౌళి తన ఫైనల్ టార్గెట్ మహాభారతం అని చెబుతూనే ఉన్నాడు. ఇక మలయాళంలో మ‌హాభార‌తాన్ని ఇరండామూలం అనే పేరుతో 1000 కోట్లతో తెర‌కెక్కిస్తార‌ని అనౌన్స్ చేసారు కూడా. ఇక టాలీవుడ్ అగ్రనిర్మాత అరవింద్ మరికొంతమంది నిర్మాతలతో కలిసి రామాయణాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కేస్తామని.. దానికి దంగల్ దర్శకుడు పనిచేస్తాడని గత ఏడాదే ప్రకటించినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మెగా వారి రామాయణం ఆగిపోయింది అనే న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా అరవింద్ రామాయణం ఆగలేదని.. దానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. రామాయణ కావ్యాన్ని కేవలం మూడు గంటల్లో కుదించి.. దానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నాడనే టాక్ టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ముందు తెలుగు కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేసి తర్వాత మిగతా భాషల స్క్రిప్ట్ వర్క్ చేస్తారని.. ప్రస్తుతం రామాయణం స్క్రిప్ట్ మీద త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడని అంటున్నారు. సో ఎన్టీఆర్ RRR ఫినిష్ చేసి వచ్చేవరకు త్రివిక్రమ్ రామాయణం స్క్రిప్ట్ వర్క్ డైలాగ్ వర్క్ పూర్తి చేస్తాడని అంటున్నారు. 

Ramayana with Trivikram dialogues:

Trivikram script work for Allu Arvind Ramayana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs