బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలోకి సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టింది. టాప్ 5 లో అఖిల్, సోహైల్, అరియనా, అభిజిత్, హరికలు ఉన్నారు. అయితే ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యి నాగ్ తో స్టేజ్ మీదకొచ్చింది. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన మోనాల్ ఎట్టకేలకు చివరి వారంలో చివరి కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ లోకి వచ్చింది. మోనాల్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో అని అలామంది ఎదురు చూసారు. ఈరోజు అది జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో ఫస్ట్ నుండి నామినేషన్స్ ని ఫేస్ చేస్తున్న కూలెస్ట్ పర్సన్ అభిజిత్ టాస్క్ ల పరంగా విమర్శలు ఎదుర్కున్నాడు.
టాస్క్ లు ఆడకపోయినా అభిజిత్ ఫాలోయింగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ సెట్ అయ్యింది అంటే మాములు విషయం కాదు. మధ్యలో అభిజిత్ గ్రాఫ్ పడిపోయి కాస్త క్రేజ్ తగ్గినట్టుగా అనిపించినా మళ్ళీ అభిజిత్ గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో ఉన్నప్పుడు ముందు సోహైల్ సేవ్ అయ్యి టాప్ 5 కి వెళ్ళిపోయాడు. దానితో అభిజిత్ ఫాన్స్ సోషల్ మీడియాలో కింగ్ ఆఫ్ హార్ట్స్ అభిజీత్ అంటూ 1 మిలియన్ ట్వీట్స్ తో ట్రెండ్ర్ సెట్ చేసి చూపించారు. మరి టాస్క్ ల పరంగా తేలిపోయిన అభిజిత్ ని అభిమానులు మాత్రం ఆకాశంలో నించోబెట్టారు. అభిజిత్ విన్నర్ అయినా లేకపోయినా ఈ అభిమానం మాత్రం అదిరిపోయింది