Advertisement
Google Ads BL

బుల్లితెర ప్రేక్షకులని సంతోషపెట్టిన బిగ్ బాస్!


బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తర్వాత ఐదారు వారాలకే మోనాల్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ప్రేక్షకులకు బిగ్ బాస్ మాత్రం వారం వారం షాకిస్తూనే ఉంది. మోనాల్ గ్లామర్ షో.. అఖిల్ తో లవ్ ట్రాక్ తో బిగ్ బాస్ కి కంటెంట్ దొరకడంతో మోనాల్ ని వారం వారం సేవ్ చేస్తూ కుమార్ సాయి, మెహబూబ్, ఇంకా అవినాష్ లాంటి గట్టి కంటెస్టెంట్స్ ని బయటికి పంపేసింది బిగ్ బాస్. బిగ్ బాస్ పై ఎంతగా ట్రోలింగ్ చెసినా మోనాల్ ని కాపాడుతూనే ఉంది. అసలు అవినాష్ ఎలిమినేట్ అయిన వారం అంటే గత వారం మోనాల్ ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అనూహ్యంగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్ అఖిల్ ని పట్టుకుని ఎలాగో ఇన్ని వారాలు హౌస్ లో ఉంది. అఖిల్ తో ఫ్రెండ్ షిప్, అభిజిత్ తో ఫ్రెండ్ షిప్ చేసి హౌస్ లో టాప్ 5 కి వెళ్లాలని కలలు కంది. కానీ అభిజిత్ మోనాల్ వలలో పడలేదు.

Advertisement
CJ Advs

అఖిల్ మాత్రం అటు తన స్వార్ధానికి మోనాల్ ని వాడుకున్నాడు. ఇటు మోనాల్ కూడా అఖిల్ ని వాడేసుకుంది. ఇక తాజాగా ఈ రోజు లాస్ట్ ఎలిమినేషన్ లో భాగంగా మోనాల్ ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు షురూ అయ్యాయి. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ గా ఎలిమినేట్ అయ్యింది మోనాల్ అని అంటున్నారు. మరి ఇప్పటివరకు అఖిల్, సోహైల్ లు టాప్ 5 కి వెళ్లారు. ఇక మిగిలిన హారిక, అరియనా, అభిజిత్ లు  ఈరోజు టాప్ 5 కి వెళుతున్నారు. మరి మోనాల్ ఎట్టకేలకు ఈ రోజు హౌస్ నుండి బయటికి రాబోతుంది. ఇన్ని రోజులుగా మోనాల్ ఎలిమినేట్ అవుతుంది అని ఎదురు చూసిన బుల్లితెర ప్రేక్షకులకు ఎట్టకేలకు మోనాల్ బయటికి రావడంతో హమ్మయ్య అంటున్నారు. మోనాల్ ఏడుపుకి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా చిరాకు పడ్డారో సోషల్ మీడియాలో మోనాల్ పై వచ్చిన న్యూస్ లు చూస్తేనే అర్ధమవుతుంది.

Monal Eliminated From Bigg boss house:

Bigg Boss 4: Monal Gets Eliminated this week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs